News

మాండూస్ తుఫాన్ .. AP లోని ఈ 6 జిల్లాలోనే అధిక ప్రభావం ..హెచ్చరిక జారీ !

Srikanth B
Srikanth B
Mandus cyclone in  AP
Mandus cyclone in AP

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాన్ క్రమేపి బలహీన పడుతున్న , తమిళనాడు మరియు ఆంధ్ర ప్రదేశ్ లో భారీ వర్షాలు , నష్టాలను కలుగచేసింది , ఇప్పటికే ఈ తుఫాను పై అప్రమత్తం చేసిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం.. ఆది, సోమ వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ,ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ముందు నుంచి ప్రత్యేక చర్యలను తీసుకుందన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్. జవహర్ రెడ్డి ప్రతిరోజు సమీక్షలు నిర్వహించి అధికారులకు అమలు చేయాల్సిన విధివిధానాలు గురించి ఆదేశాలు జారీచేసారని తెలిపారు.

సముద్రంలో వేట కోసం వెళ్ళిన మత్స్యకారులను వెనక్కి పిలిపించామన్నారు. భారీ వర్షాలు, ఈదుర గాలుల నేపధ్యంలో అవసరమైన హెచ్చరికలను ప్రభుత్వం జారీ చేసిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్. జవహర్ రెడ్డి తెలిపారు .

ఆంద్రప్రదేశ్ లోని ఆరు జిల్లాల్లోని 32 మండలాల్లో తుపాను ప్రభావం అధికముగా ఉందని .. లోతట్టు ప్రాంతాల నుంచి 708 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలించామన్నారు. 33 సహాయక శిబిరాలని ఏర్పాటు చేసామని, 778 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. పునరావాస కేంద్రాల్లో భోజనం, తాగునీరు సదుపాయం కల్పించామన్నారు. సహాయక చర్యలకోసం ప్రకాశం జిల్లాలో 2, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 3, తిరుపతి జిల్లాలో 2, చిత్తూరు జిల్లాలో 2 మొత్తంగా 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించామన్నారు.

తీరం వైపు దూసుకొస్తున్న తుఫాను .. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనా ..!

శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో 23.4., తిరుపతి జిల్లాలో 2.4, వైయస్సార్ కడప జిల్లాలో 13.2 మిల్లీమీటర్ల .. అన్నమయ్య జిల్లాలో 20.5 మిల్లీ మీటర్లు, చిత్తూరు జిల్లాలో 22 , ప్రకాశం జిల్లాలో 10.1, సగటు వర్షపాతం నమోదైందని అన్నారు. ఆరు జిల్లాల్లోని 32 ప్రాంతాల్లో 50 మిల్లీ మీటర్లకంటే అధిక వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు .

మరో వైపు తమిళనాడు లోని తీరా ప్రాంతాలపై కూడా మాండూస్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది .. ఇప్పటికే తుఫాను కారణముగా నష్టపోయిన వారికీ తమిళనాడు ముఖ్యమంత్రి నష్ట పరిహారం ప్రకటించారు .

తీరం వైపు దూసుకొస్తున్న తుఫాను .. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనా ..!

Share your comments

Subscribe Magazine

More on News

More