News

తీరం వైపు దూసుకొస్తున్న తుఫాను .. తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచనా ..!

Srikanth B
Srikanth B

తెలుగు రాష్ట్రాలను  IMD అప్రమత్తం చేసింది బంగాళాఖాతంలో మరో తుఫాన్‌ తీరం వైపు దూసుకొస్తుందని దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం ఉందని అయితే అధిక ప్రభావం మాత్రం ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలపై ఉంటుందని .. దీనితో రాష్ట్ర వ్యాప్తముగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు 

ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మాండౌస్ సైక్లోన్... తీవ్ర తుఫానుగా మారింది. శనివారం అర్ధరాత్రి తర్వాత తుఫాను తీరం దాటే అవకాశముందనిIMD అధికారులు పేర్కొన్నారు . తమిళనాడు, ఏపీలకు మరో 48 గంటల్లో భారీ వర్షం పడే సూచన ఉందని వాతావరణశాఖ తెలిపింది.

మాండౌస్ తీవ్ర తుఫాన్ నుంచి అతి తీవ్ర తుఫాన్ గా మారే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు . తుఫాన్ తీరం దాటే సమయంలో 80 నుంచి 117 కిలోమీటర్ల వేగంతో తీవ్ర గాలులు వీచే అవకాశం ఉందని IMD పేర్కొంది. మాండౌస్ సైక్లోన్ తమిళనాడు మల్లాపురానికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమైందని తెలిపింది.

ఎద్దు మూత్రం పోసినందుకు ఫైన్ .. భద్రాద్రి కొత్తగూడెం వింత ఘటన !

అయితే తుఫాను కారణంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ కోస్తా అలాగే రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ తుఫాను యొక్క ప్రభావం అటు తమిళనాడు పై కూడా ఉండనున్నట్లు తెలిపింది .

ఎద్దు మూత్రం పోసినందుకు ఫైన్ .. భద్రాద్రి కొత్తగూడెం వింత ఘటన !

Share your comments

Subscribe Magazine