News

తైవాన్లో భారీ భూకంపం.... సునామి హెచ్చరికలు జారీచేసిన ప్రభుత్వం......

KJ Staff
KJ Staff

తైవాన్ రాజధాని తైపీ లో బుధవారం తెల్లవారుజామున భారి భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 7.4 గా నమోదయ్యింది. భూకంపం సంభవించింది తెల్లవారుజామున కనుక జనం భయ భ్రాంతులకు లోనై బయటకు పరుగు తీశారు.

తైపీలో లోని భూకంపం తీవ్రతకు, బిల్డింగ్లు నేలకొరిగాయి. యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం, ఈ భూకంపం, తూర్పు తైవాన్లోని, హువాయిన్ నగరానికి 18 కిలోమీటర్ల దూరంలో, 34.8 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఈ భూకంపం తైవాన్ భారీ నష్టాన్ని కలిగించింది. అయితే ఇప్పటవరకు ప్రాణనష్టం, మరియు ఆస్తి నష్టానికి సంబంధించిన ఎటువంటి వివరాలను అధికారులు వేల్లడించలేదు. ఆస్తి నష్టం భారిగా ఉండచ్చని అంచనా వేస్తున్నారు.

భూకంపం కారణంగా తైవాన్లోని రవాణా నిలిచిపోయింది. బిల్డింగ్లు కూలిపోవడంతో పలు రవాణా సేవలను తైవాన్ ప్రభుత్వం నిలిపివేసింది. దేశవ్యాప్తంగా రైల్వే సేవలను ననిలిపివేశారు. భూకంపం ధాటికి కొన్ని చోట్ల కొండా చర్యలు కూడా విరిగిపడ్డట్టు తెల్సుతుంది. దేశవ్యాప్తంగా స్కూళ్లకు, ఆఫీసులకు సెలవులు ప్రకటించారు. పవర్ ప్లాంట్ దెబ్బతినడంతో, విద్యుత్ సరఫరా నిలిచి ప్రజలు తీవ్ర ఇబ్బందలు ఎదురుకుంటున్నారు.

సునామి హెచ్చరిక:

భూకంపం తర్వాత తైవాన్ మరియు ఫిలిపైన్స్, జపాన్ దేశాల్లో సునామి హెచ్చరికలు జారీచేశారు. సముద్రంలో మూడు మీటర్ల వరకు అంటే దాదాపు 10 అడుగుల వరకు అలలు ఎగసిపడే అవకాశం ఉన్నటు జపాన్ వాతావరణ సంస్థ అంచనా వేస్తుంది. సునామి సూచనలు ఉన్నందున తీరా ప్రాంత ప్రజలకు హెచ్చరికలు జారీ చేసారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, తగిన జాగ్రత్తలు వహించాలని అధికారులు సూచించారు. అయితే తైవాన్లోని భూకంపం తో సునామి ముప్పు తప్పినట్లేనని, పసిఫిక్ సునామి హెచ్చరిక కేంద్రం వెల్లడించింది. తైవాన్లో 25ఏళ్ల తర్వాత ఇంత పెద్ద భూకంపం సంభవించింది. 1999 లో 7.6 తీవ్రతతో భూకంపం సంభవించగా సుమారు రెండు వేలకు పైగా జనం తమ ప్రణాలను కోల్పోయారు. ప్రస్తుతం భూకంపం భారిన పడిన నగరాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Share your comments

Subscribe Magazine

More on News

More