టైవాన్లో మరోసారి భారీ భూకంపం సంభవించింది. ఒక్కరోజులోనే ఎన్నో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. సోమవారం సాయంత్రం నుండి ఈ రోజు తెల్లవారుజాము వరకు సుమారు 80 సార్లు భూకంపాలు రావడంతో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. తైవాన్లోని హువాయున్ నగరానికి తూర్ప కౌంటీ భూభాగంలో 5.5 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం నిక్షిప్తమై ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఈ భూకంపాల్లో మొదటి భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.5తీవ్రతతో నమోదు కాగా, ఆఖరి భూకంపం అత్యధికంగా ఆఖరి భూకంపమ్ 6.3 తీవ్రతతో నమోదయ్యింది.
తైవాన్లోని అనేక ప్రాంతాల్లో ఈ భూకంపాలు వచ్చాయి. టైవాన్ రాజధాని తైపీతో పాటు పశ్చిమ తైవాన్లోని పలు ప్రాంతాల్లో ఈ భూకంప ప్రభావం కనబడింది. వరుస భూకంపాల దాటికి పలు భవనాలు నేలకొరిగాయి. అయితే టైవాన్ దేశంలో భూకంపం సంభవించడం ఈ నెలలో ఇది రెండో సారి. వరుసగా సంభవిస్తున్న భూమకంపాలకు టైవాన్ ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఆస్తి నష్టం ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఏవి వెల్లడించలేదు.
తైవాన్లో సంభవించిన భూకంపం, చైనా, జపాన్, ఫిల్లీఫిన్స్ దేశాల మీద కూడా ప్రభావం చూపించింది. ఇది ఇలా ఉంటే, ఏప్రిల్ నెల మూడో తారీఖున కూడా టైవాన్ దేశంలో 7.5 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి ఎన్నో భవనాలు నేలకొరిగాయి, 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దేశంలో తరచూ భూకంపలు సంభవిస్తాయి. భూకంపాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్న టెక్టోనిక్ ప్లేట్స్ జంక్షన్ లో ఈ దేశం ఉండటం దీనికి ప్రధాన కారణం. ప్రస్తుతం సంభవించిన భూకంపం ఎంత ఆస్థి నష్టం మరియు ప్రాణ నష్టం కలిగించిందో అంచనా వేస్తున్నారు. భూకంపం భారిన పడిన నగరాల్లో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి.
Share your comments