News

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లో గ్రామీణ మహిళల దూకుడు.

S Vinay
S Vinay

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అనేది వేతన ఉపాధి కార్యక్రమం, ఇది దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో నివసించే కుటుంబాలకు జీవనోపాధి భద్రతను కల్పిస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో వంద రోజుల పనిని కల్పిస్తూ నిరుద్యోగం నుండి ఉపశమనం ఇస్తుంది. ఇందులో పాల్గొనడానికి అందరు స్వచ్చందంగా ముందుకు వస్తారు.


మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నియమ నిబంధనల ప్రకారం లబ్దిదారులలో కనీసం మూడింట ఒక వంతు మందిలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఒంటరిగా ఉన్న మహిళలు మరియు వికలాంగులు ఇందులో పాల్గొనడానికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.ముఖ్యంగా ఈ పథకంలో పురుషులకి మరియు మహిళలకి సమానమైన వేతనాలు అందిస్తుంది. పని జరిగే ప్రదేశంలో పిల్లల సంరక్షణ కొరకై ప్రత్యేక షెడ్లను ఏర్పాటు కూడా ఉంటుంది. ఈ పథకంగ్రామస్థుల నివాసాలకి సమీపంలోనే పనులను అందించడానికి ప్రయత్నిస్తుంది.కాబట్టి మహిళలు ఈ పథకం కింద సులభంగా పని చేయడానికి దోహదపడుతుంది.

అయితే గత మూడు ఆర్థిక సంవత్సరాల నుండి చేసుకున్నట్లయితే ఈ పథకంలో మహిళల భాగస్వామ్యం గణనీయంగా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఉపాధి హామీలో పాల్గొన్న వారిలో మహిళల శాతం 54.54 గ ఉంది ఇది పురుషులు పాల్గొంటున్న దాని కన్నా ఎక్కువగా ఉండటం విశేషం.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం గురించి తెలుసుకుందాం.


ఈ పథకం 2005 లో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ క్రింద అమలు చేయబడింది.

గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారికి ప్రతి సంవత్సరం 100 రోజుల పనిని కల్పిస్తుంది.

గ్రామీణ ప్రాంతాల్లో, జాబ్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరికి ఈ పథకం కింద పని కల్పించబడుతుంది.

కరువు/ప్రకృతి విపత్తు వుండే గ్రామీణ ప్రాంతాలలో అదనంగా 50 రోజుల పని ఉంటుంది.

మరిన్ని చదవండి.

PADMA AWRDS 2022 : సేఠ్పాల్ సింగ్, అభ్యుదయ రైతుకు పద్మశ్రీ పురస్కారం!

భారతీయ రైతులకి అత్యంత చేరువైన స్వరాజ్ ట్రాక్టర్ ప్రయాణం మరియు వారి కొత్త బహుళ ప్రయోజక మెషిన్ 'కోడ్' గురించి హరీష్ చవాన్ గారి మాటల్లో:

Share your comments

Subscribe Magazine