భారతీయ రైతుల అందరిని ఒక తాటి మీద నడిపించేందుకు, మొదలైన MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర మరొక్క మైలు రాయిని చేరుకుంది. ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు సుమారు 600 కిలోమీటర్లు సాగిన ఈ యాత్ర ఇప్పుడు, రాజస్థాన్, అజ్మెర్ వరకు చేరుకుంది. ఉత్తర్ ప్రదేశ్, ఝాన్సీ లక్ష్మి భాయ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ యాత్ర రధం భారత దేశంలోని పశ్చిమ రాష్ట్రాల మీదుగా సాగుతుంది.
లోకసభ ఎన్నికలు 2024: 17 నిండిన వారు కూడా ఓటర్ ఐడి పొందవచ్చా......
అజ్మెర్లోని ఈ కార్యక్రమం, విజయవంత కావడానికి, అక్కడి ఫార్మ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజషన్,(FPO) పుష్కర్ వాలా, మరియు రైతు దుర్గేష్ సైని సహాయసహకారాన్ని అందించారు. అజ్మెర్ లో జరిగిన ఈ భరత్ యాత్ర రోడ్ షో ద్వారా రైతులకు మిల్లియనీర్ ఫార్మర్ అఫ్ ఇండియా అవార్డుల గురించి, తెలియపరచడమైనది. వ్యవసాయ రంగానికి విశేషమైన కృషి చేసి ఘన విజయాలు సాధిస్తున్న రైతులను సత్కరించడానికి మొదలు పెట్టినవే ఈ MFOI అవార్డులు.
ఈ రోడ్ షో ద్వారా రైతులకు కొత్త వ్యవసాయ పరిజ్ఞానంపై అవగాహన కల్పించడం జరిగింది. పెరుగుతున్న జనాభా మరియు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, వ్యవసాయ ఉత్పత్తిని, నాణ్యత పెంచడానికి, ఈ పరిజ్ఞానం ఎంతో అవసరం. రైతులకు వ్యవసాయ పరిజ్ఞానం గురించి తెలియచెయ్యడం ద్వారా వారికి, ఆశక్తి పెరిగి, ఈ పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో ఉపయోగించే అవకాశం ఉంటుంది.
Share your comments