News

6000కిలోమీటర్లు పూర్తిచేసుకున్న MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర:

KJ Staff
KJ Staff

భారతీయ రైతుల అందరిని ఒక తాటి మీద నడిపించేందుకు, మొదలైన MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర మరొక్క మైలు రాయిని చేరుకుంది. ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు సుమారు 6000 కిలోమీటర్లు సాగిన ఈ యాత్ర భవిష్యత్తులో కూడా ఇలాగే దిగ్విజయంగా ముందుకు సాగుతుంది. ఉత్తర్ ప్రదేశ్, ఝాన్సీ లక్ష్మి భాయ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రాంగణం నుండి ప్రారంభమైన ఈ యాత్ర రధం భారత దేశంలోని పశ్చిమ రాష్ట్రాల మీదుగా సాగుతుంది. ప్రస్తుతం ఈ యాత్ర రథం రాజస్థాన్లోని అజ్మెర్ లో ప్రయాణిస్తుంది.

MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర ద్వారా, రైతులకోసం వినూత్నంగా ప్రారంభించిన, మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డుల గురించి రైతులకు తెలియచేయడం జరుగుతుంది. వ్యవసాయంలో విశేష కృషి చేసి, వ్యవసాయం ద్వారా లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్న రైతులను MFOI అవార్డులతో సత్కరించడం జరుగుతుంది. ఈ అవార్డులు పొందడానికి భారత దేశంలోని అన్ని ప్రాంతాల రైతులు అర్హులే. ఈ అవార్డుల గురించి రైతులను జాగృతం చెయ్యడానికి ఈ యాత్ర రథం భారత దేశంలోని అన్ని ప్రాంతాలకు వెళ్తుంది.

Read More

MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర: అజ్మెర్, రాజస్థాన్

MFOI అవార్డుల గురించి తెలియచెయ్యడంతో పాటు, రైతులకు కొత్త వ్యవసాయ పరిజ్ఞానం మీద కూడా అవగాహాన కల్పించేందుకు VVIF కిసాన్ భరత్ యాత్ర తోడ్పడుతుంది. పరిజ్ఞానాన్ని వ్యవసాయంతో అనుసంధానం చెయ్యడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకతను, ఆహార నాణ్యతను పెంచవచ్చు. ఉత్తర్ ప్రదేశ్ ఝాన్సీ లో మొదలైన ఈ యాత్ర, పశ్చిమ రాష్ట్రాల మీదుగా, మహారాష్ట్ర వరకు కొనసాగనుంది.

Read More

కొత్త రకం క్యారెట్లను అభివృద్ధి చేసిన సోమని సీడ్స్:

Share your comments

Subscribe Magazine

More on News

More