రైతులు వ్యవసాయానికి చేస్తున్న సేవలను గుర్తించి, వారి ఘనతను ప్రపంచానికి చాటి చెప్పడానికి కృషి జాగరణ్ విశిష్టమైన మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డులను బహుకరించడం ప్రారంభించింది. ఈ అవార్డుల ప్రాముఖ్యత భారత దేశ నలుమూలలకు చేరేందుకు MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర ద్వారా, కృషి జాగరణ్ ప్రతినిధులు భారత దేశంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి అక్కడి రైతులకు ఈ మిలియనీర్ ఫార్మర్ ఆప్ ఇండియా విశిష్టతల గురించి చాటిచెబుతున్నారు.
గత 27 సంవత్సరాలుగా కృషి జాగరణ్ రైతుల అభ్యున్నతి కోసం ఎన్నో ప్రత్యేకమైన కార్యాక్రమాలను మొదలుపెట్టింది. వాటిలో ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమం ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డుల ప్రధానోత్సవం. వ్యవసాయ రంగంలో విశేషమైన కృషి చేసి లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్న రైతులను ఈ MFOI అవార్డుతో సత్కరిస్తారు. ప్రత్యేకంగా రూపొందించిన MFOI VVIF యాత్ర రధం భారత దేశంలోని అన్ని ప్రాంతాలకు సంచరిస్తూ రైతులకు MFOI పురస్కారాల విశిష్టతను తెలియపరుస్తారు. MFOI అవార్డులను పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల రైతులంతా అర్హులే, కానీ వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం మాత్రం 10 లక్షలకు మించి ఉంటేనే ఈ అవార్డు లభిస్తుంది.
ఈ యాత్ర కార్యక్రమం ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ నుండి ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ యాత్ర రధం దక్షణాది రాష్ట్రాల మీదుగా సాగుతుంది. ఉత్తర్ ప్రదేశ్, గుజరాత్, హర్యాన, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో సంచరిస్తూ రైతులకు MFOI అవార్డుల ప్రత్యేకత గురించి చాటిచెబుతుంది. కృషి జాగరణ్ భారతీయ వ్యవసాయానికి చేస్తున్న కృషి మరియు సహాయం గురించి రైతులకు, కృషి జాగరణ్ సభ్యులు వివరిస్తున్నారు. ఈ రోజు హర్యానాలోని, కారాఉంది గ్రామంలో రైతులతో సమావేశం జరిగింది. ఎంతోమంది ఔత్త్సహికులైన రైతులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. కిసాన్ భారత యాత్ర దిగ్విజయంగా కొనసాగడానికి సహాయం చేస్తున్న మహీంద్రా ట్రాక్టర్లు మరియు స్థిల్ కంపెనీ వారు తమ ఉత్పత్తులను రైతులకు ప్రదర్శించారు.
మహీంద్రా ట్రాక్టర్లు అన్ని వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా ట్రాక్టర్లు రూపొందిస్తున్నారు. హర్యానాలోని ఈ కార్యక్రమానికి విచ్చేసిన రైతులు అందరికి తమ ట్రాక్టర్ల పనితీరును స్వయంగా పరీక్షించుకునే విధంగా ప్రదర్శనలో ఉంచారు. అదేవిధంగా స్థిల్ కంపెనీ జర్మన్ టెక్నాలజీ ఉపయోగించి వ్యవసాయానికి మరియు గార్డెనింగ్ కి అనుగుణంగా ఎన్నో ఉపకరణాలు తయారుచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి స్థిల్ కంపెనీ తరుపున ప్రతినిధిగా విచ్చేసిన హరిప్రీత్ సింగ్ తమ ఉపకరణాల గురించి రైతులకు వివరించారు.
కృషి జాగరణ్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ భారత యాత్ర రోడ్ షోలకు విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఎంతో మంది రైతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని MFOI అవార్డుల గురించి తెలుసుకుంటున్నారు. ఈ రోజు కార్యక్రమానికి సుమారు 30 మంది రైతులు సోదరులు హాజరయ్యారు. హాజరయిన రైతులందరికి డిజిటల్ మాధ్యమం ద్వారా MFOI అవార్డుల గురించి, ప్రభుత్వం వ్యవసాయానికి అందిస్తున్న సాయాన్ని గురించి మరియు కేవీకేల గురించి కృషి జాగరణ్ సభ్యలు వివరించారు.
Share your comments