భారత దేశంలోని రైతులందరిని ఒకే త్రాటిపైకి చేర్చి, వారి పడుతున్న కష్టాలను, మరియు నిరంతర కృషి ద్వారా సాధించిన విజయాలను ప్రపంచానికి తెలియచేయడానికి మొదలు పెట్టినవే MFOI అవార్డులు. ఈ అవార్డులను కృషి జాగరణ్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది. గత 27 సంవత్సరాలుగా కృషి జాగరణ్ రైతుల అభ్యున్నతి కోసం ఎన్నో ప్రత్యేకమైన కార్యాక్రమాలను మొదలుపెట్టింది. వాటిలో ఎంతో ప్రత్యేకమైన కార్యక్రమం ఈ మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా(MFOI) అవార్డుల ప్రధానోత్సవం. వ్యవసాయ రంగంలో విశేషమైన కృషి చేసి లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్న రైతులను ఈ MFOI అవార్డుతో సత్కరిస్తారు. కానీ ఈ అవార్డులను పొందేందుకు కొన్ని అర్హతలు కలిగి ఉండాలి.
MFOI అవార్డుల దేశంలోని రైతులందరికీ తెలియపరచడానికి MFOI VVIF కిసాన్ భరత్ యాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఈ యాత్ర రధం భారత దేశంలోని అన్ని ప్రాంతాలకు సంచరిస్తూ రైతులకు MFOI పురస్కారాల విశిష్టతను తెలియపరుస్తారు. MFOI అవార్డులను పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల రైతులంతా అర్హులే, కానీ వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయం మాత్రం 10 లక్షలకు మించి ఉంటేనే ఈ అవార్డు లభిస్తుంది. 10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం పొందే రైతులను మిల్లియనీర్ లేదా, లక్షాధికారి రైతులంటారు. వ్యవసాయం లాభదాయకం కాదు అని నమ్మే వాళ్ళకి వ్యవసాయం నుండి కూడా అధిక లాభాలు పొందవచ్చు అని ఈ MFOI అవార్డులు ఉపయోగపడతాయి.
MFOI VVIF కిసాన్ భరత్ రధం, మధ్య ప్రదేశ్ లోని ఝాన్సీలో మొదలై, మధ్య మరియు పశ్చిమ భారత రాష్ట్రాల మీదుగా ప్రయాణిస్తుంది. ప్రయాణంలో ఈ రోజు ప్రయాణం మధ్య ప్రదేశ్లోని, సాత్నా, మజిహ్గ్వా వరకు చేరుకుంది ఈ యాత్ర కార్యాక్రమానికి STIHL ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వాములుగా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్ర లో భాగంగా STIHL కంపెనీ తమ వ్యవసాయ యంత్రాలు నేరుగా రైతుల వద్దకే తీసుకువెళ్లి వాటి పనితీరుపై అవగాహనా కల్పిస్తారు.రైతులు వారి వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చెయ్యవచ్చు.
మధ్య ప్రదేశ్లోని, సాత్నా లోని ఈ యాత్ర విజయవంతం కావడానికి అక్కడి ఉదయం ఆగ్రో ఫార్మ్ ప్రొడ్యూసర్ కంపెనీ అనే సంస్థ సహకారాన్ని అందించింది. కృషి జాగరణ్ సభ్యులు రైతులకు, MFOI అవార్డుల గురించి తెలియచేసారు. అలాగే ఈ అవార్డులు పొందడానికి అర్హత ఉన్న రైతులకు వీటికి ఎలా నమోదు చేసుకోవాలో మార్గదర్శకాన్ని అందించారు.
Share your comments