News

గుజరాత్ "మిల్లెట్ మహోత్సవ 2024" - అందరూ ఆహ్వానితులే......

KJ Staff
KJ Staff

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, చొరవతో, యునైటెడ్ నేషన్స్, 2023 ని , ఇంటర్నేషనల్ ఇయర్ అఫ్ మిల్లెట్స్గా ప్రకటించింది. తగ్గుముఖం పట్టిన చిరు ధాన్యాల పంటల సాగును తిరిగి పెంచేందుకు, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా పోయిన సంవత్సరం, చిరు ధాన్యాలు అయినా రాగులు, సజ్జలు, అవిసెలు, మొదలగు పంటల ఉత్పత్తిని పెంచేందుకు, మరియు వాటి వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఇదే క్రమంలో, గుజరాత్ అహ్మదాబాద్ లో గల, సబర్మతి రివర్ఫ్రంట్ గ్రౌండ్ లో మిల్లెట్ మహోత్సవ 2024 కార్యక్రమాన్ని ప్రారంభించింది.


మార్చ్ 1న ప్రారంభం అయినా ఈ కార్యక్రమం, మార్చ్ 2 వరకు జరగనుంది. ఈ మహోత్సవానికి సాయంత్రం 4 గం.ల నుండి రాత్రి 10 గం.ల వరకు సందర్శించవచ్చు. చిరు ధాన్యాల ఉపయోగాలు ప్రజలకు తెలియపరచి వారిని చెతన్యవంతులను చేయడానికి ఈ కార్యక్రమం అనువైనది. ఉత్సవం లో భాగంగా, చిరు ధాన్యాలను ముఖ్య ఆకర్షణగా అనేక దుకాణాలను, మిల్లెట్స్ తో తయారు చేసిన అనేక పిండి వంటలను ఫుడ్ స్టాల్స్ను ప్రదర్శనలో ఉంచారు. ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి. రిషికేష్ భాయ్ పటేల్ ప్రారంభించారు. అహ్మదాబాద్ సిటీ మేయర్. ప్రతిభ బెహెన్ జైన్, జిల్లా పంచాయతీ ప్రెసిడెంట్. కంచెం బెహెన్ వాఘేలా, జిల్లా కలెక్టర్. ప్రవీణ డి.కె, తదితరులు ముఖ్య అతిధులుగా హాజరు అయ్యారు.

చిరు ధాన్యాల సాగు వాళ్ళ అనేక ఉపయోగాలు ఉన్నాయ్. ముఖ్యంగా అతికొద్ది వనరులతోనే, మంచి దిగుబడిని ఇస్తాయి. పెరుగుతున్న జనాభాతో పాటు, మన ఆహార వనరులను కూడా వైవిధ్యంగా మలచుకోవాల్సి ఉంది. చిరు ధాన్యాలు, ప్రధాన ఆహార పంటలు అయినా వరి, మరియు గోధుమలు మంచి ప్రత్యామ్నాయం. చిరు ధనయాలను మన రోజువారి ఆహారంలో ఒక భాగం చెయ్యడం వళ్ళ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయ్.

Share your comments

Subscribe Magazine