News

ఏకంగా ప్రధానిని మెప్పించిన కృష్ణజింకలు.. రోడ్డు దాటుతున్న 3 వేల జింకలు.. వీడియో వైరల్?

KJ Staff
KJ Staff

ప్రస్తుతం టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందడంతో ఈ ప్రపంచంలో ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందుతుంది. ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు చూడని వింత అరుదైన సన్నివేశాలను కూడా మనం చూడగలుగుతున్నాము.ఈ క్రమంలోనే ఏకంగా భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీని మెప్పించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

గుజరాత్‌లోని ఓ అడవిలో సుమారు 3వేల కృష్ణ జింకలు రోడ్డు దాటుతున్న అద్భుతమైన వీడియోను ప్రధానమంత్రి తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.ఈ వీడియోలో జింకలు ఒకే చోటున గుంపులు గుంపులుగా చెంగు చెంగున ఎగురుతూ ఉంటే చూడటానికి ఎంతో అద్భుతంగా ఉంది. ఈ క్రమంలోనే మోడీ ఈ వీడియోను షేర్ చేస్తూ "అద్భుతం" అనే క్యాప్షన్ జోడించారు. గుజరాత్లోని భావనగర్‌లో గల కృష్ణజింకల పార్క్ లో తీసిన ఈ వీడియోను ట్విట్టర్ హ్యాండిల్ డిపార్టుమెంట్ ఆఫ్ ఇన్ ఫర్మేషన్ షేర్ చేయడంతో ఈ వీడియో ప్రధాని నరేంద్రమోడీ దృష్టికి వచ్చింది.

ఈ విధంగా కృష్ణజింకలు ఒకేచోట సందడి చేయడంతో నరేంద్ర మోడీ ఎదో ఆశ్చర్యపోతూ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా ఎంతోమంది నెటిజన్లను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం కృష్ణజింకల కు సంబంధించిన ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Related Topics

pm modi gujarat tweet blackbucks

Share your comments

Subscribe Magazine