కరోనా వైరస్ తో ఇప్పుడిపుడే ఊపిరి పీల్చుకుంతున్న ప్రజలకు మంకీ ఫాక్స్ అనే మరొక వైరస్ వ్యాప్తి ప్రపంచ వ్యాప్తం గ కలకలం రేపుతోంది దీనితో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించింది. మంకీ పాక్స్ వైరస్ విషయంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తూ, 'గ్లోబల్ హెల్త్ ఎమర్జన్సిని' ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కపిడింది.
పశ్చిమ ఆఫ్రియాలో మొదలై ప్రపంచంలోని పలు దేశాలకు మంకీ పాక్స్ వైరస్ విస్తరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంకీ పాక్స్‌ని గ్లోబల్ హెల్త్ ఎమర్జన్సీగా ప్రకటించాలనే డిమాండ్లు వచ్చాయి. అయితే, తొలుత తటపటాయించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, కాస్త లేటుగా అయినా, కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ దేశాలు అప్రమత్తం గ ఉండాలని సూచన ..
భారతదేశంలో ఇప్పటికే మూడు మంకీ పాక్స్ కేసులు వెలుగు చూశాయి. అవి మూడూ కేరళలోనే కనుగొనబడ్డాయి. విదేశాల వచ్చిన వ్యక్తి ద్వారా దేశంలోకి మంకీ పాక్స్ వైరస్ ప్రవేశించింది.
ఆయుస్మాన్ కార్డుతో రూ.5 లక్షలు వైద్య సాయం .. ఎలాగంటే?
అసహజ లైంగిక సంపర్కం ద్వారా మంకీ పాక్స్ వేగంగా వ్యాప్తి చెందే అవకాశం వుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకరి నుంచి ఒకరికి ఈ వైరస్ వేగంగానే వ్యాపిస్తుంది. విమానాశ్రయాలు, ఓడరేవుల్లో విదేశాల నుంచి వచ్చే ప్రయాణీకులకు హెల్త్ స్క్రీనింగ్ పరీక్షలను మరింత కఠినంగా నిర్వహించాలని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
అంతర్జాతీయ ప్రయాణీకులందరికీ మంకీ పాక్స్ వైరస్‌ని గుర్తించే వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.
Share your comments