కరోనా వైరస్ తో ఇప్పుడిపుడే ఊపిరి పీల్చుకుంతున్న ప్రజలకు మంకీ ఫాక్స్ అనే మరొక వైరస్ వ్యాప్తి ప్రపంచ వ్యాప్తం గ కలకలం రేపుతోంది దీనితో అప్రమత్తమైన ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించింది. మంకీ పాక్స్ వైరస్ విషయంలో ప్రపంచ దేశాలు అప్రమత్తంగా వుండాలని హెచ్చరిస్తూ, 'గ్లోబల్ హెల్త్ ఎమర్జన్సిని' ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కపిడింది.
తెలంగాణ రాష్ట్రంలో మంకీపాక్స్ లక్షణాలున్న వ్యక్తిని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అతన్ని హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రికి తరలించారు.
కామారెడ్డి జిల్లా ఇందిరానగర్ కాలనీకి చెందిన 40ఏళ్ల వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలున్నట్టు బయటపడింది. ఈనెల 6న అతను కువైట్ నుంచి కామారెడ్డి వచ్చారు. 20న జ్వరం వచ్చింది. 23వ తేదీ నాటికి ఒళ్లంతా రాషెస్ రావడంతో మరుసటిరోజు కామారెడ్డిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడి వైద్యులు మంకీపాక్స్ లక్షణాలున్నట్టు గుర్తించడంతో అక్కడి నుంచి 108 అంబులెన్స్‌లో ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి తరలించారు.
మంకీ పాక్స్: గ్లోబల్ హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించిన WHO .!
వారి నుంచి నమూనాలను సేకరించి పుణెలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫ్రాంటియర్ వైరాలజీకి పంపిస్తామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. అప్పటి వరకు, అతను ఫీవర్ ఆసుపత్రిలో నిర్బంధించబడి చికిత్స పొందుతున్నట్లు సమాచారం. అతనితో పరిచయం ఉన్న ఆరుగురిని గుర్తించి క్వారంటైన్ చేశారు. కోతుల వ్యాధిపై ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇది ప్రాణాంతకమైన వ్యాధి కాదు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు. ఆయన ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
Share your comments