News

ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాలు ఇవే..

KJ Staff
KJ Staff

ప్రతీ సంవత్సరంలాగానే ఈ ఏడాది కూడా ఐక్యరాజ్యసమితి, ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశాల జాబితాను విడుదల చేసింది. ఈ సంవత్సరం కూడా ఎప్పటిలాగానే ఫిన్లాండ్ దక్కించుకుంది. ప్రపంచంలోని మొత్తం 143 దేశాల స్థితిగతులను అధ్యయనం చేసి, ప్రతీ దేశానికి హ్యాపీనెస్ ర్యాంకును ఇస్తారు.

ఈ ర్యాంకింగ్ ప్రకారం ఫిన్లాండ్ మొదట స్థానం దక్కించ్చుకోగా, డెన్మార్క్ మరియు ఐస్లాండ్ రెండు మూడు స్థానాల్లో నిలిచాయి. ఇంకా అన్నిటికంటే చివరి స్థానంలో తాలిబాన్లు పాలిస్తున్న, ఆఫ్ఘానిస్తాన్ ఉంది. ఐక్యరాజ్యసమితి ఈ స్థానాలను ప్రకటించడానికి, ప్రతీ దేశంలోని ఉచిత విద్య, వైద్యం, ప్రజల్లో విశ్వసం, ప్రజా స్వేఛ, మరియు దేశం జీడీపీ వంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటుంది.

భారత్ లో పెరుగుతున్న వాయు కాలుష్యం...మనిషి ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు

గతఏడాది లాగానే భరత్ కు 126 వ స్థానం దక్కింది. మన పొరుగు దేశాలైన, నేపాల్, చైనా, పాకిస్థాన్, మనకంటే మెరుగైన స్థానాలను దక్కించుకోవడం మరొక్క విశేషం. ఫిన్లాండ్ మొదటి స్థానం దక్కించుకోవడానికి, ముఖ్య కారణం ఫిన్లాండ్ ప్రజలు, ప్రకృతికి దగ్గరగా జీవించడం, మరియు మెరుగైన పని వాతావరణంగా కొన్ని అధ్యనాలు వెల్లడించాయి.

అభివృద్ధి చెందిన దేశాలైన, అమెరికా మరియు జపాన్ 23, 24 స్థానాల్లో నిలిచాయి. టాప్ 20 లో వరుసగా, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, ఇజ్రాయిల్, నెథర్లాండ్స్, నార్వే, లక్సమ్బెర్గ్, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కోస్టా రికా, కువైట్, ఆస్ట్రియా, కెనడా, బెల్జియం, ఐర్లాండ్, చెకియా, లిథువేనియా, బ్రిటన్ ఉన్నాయి.

Share your comments

Subscribe Magazine

More on News

More