News

భారత్ లో పెరుగుతున్న వాయు కాలుష్యం...మనిషి ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు

KJ Staff
KJ Staff

భారత దేశంలో వాయు కాలుష్యం రోజురోజుకి ఎక్కువవుతూ వస్తుంది. స్విస్ ఐక్యు ఎయిర్ క్వాలిటీ సంస్థ 2023 లో ఒక నివేదికను విడుదల చేసింది ఈ నివేదిక ప్రకారం భరత్ మూడో అతి పెద్ద కాలుష్య దేశంగా నిలిచింది. మొదటి రెండు స్థానాల్లో, బాంగ్లాదేశ్ మరియు పాకిస్థాన్ నిలిచాయి. అధికంగా పెరుగుతున్న వాహనాలు వినియోగం, మరియు ఫ్యాక్టరీల నుండి వస్తున్న పొగ వలన వాయు కాలుష్యం అంతకంతకు పెరుగుతూ వస్తుంది. స్విస్ సంస్థ నివేదిక ప్రకారం 2023 భరత్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక క్యూబిక్ మీటర్కు సగటున 92.7 మైక్రోగ్రాములుగా ఉంది. గత సంవత్సరం నివేదికతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాల ఎక్కువ.

ప్రపంచ ఎయిర్ క్వాలిటీ సంస్థ 2023 లో 134 దేశాలోని, 7812 చోట్ల సర్వే నిర్వహించగా, వాటిలో అత్యంత కాలుష్య మెట్రోపాలిటన్ నగరంగా బీహార్లోని, బెగుసరాయ్ నిలిచింది. ఈ సంస్థ నివేదికల ప్రకారం ఈ నగరంలోని ఎయిర్ క్వాలిటీ ఒక క్యూబిక్ మీటర్కు, 54.4 మైక్రో గ్రాములు ఉన్నటు వెల్లడించింది. భారత దేశంలో పెరుగుతున్న వాయు కాలుష్యం మనిషి ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వాయు కాలుష్యం మనిషి ఊపిరితిత్తుల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. వాయు కాలుష్యం, లాంగ్ క్యాన్సర్, ఆస్తమా, మొదలైన రోగాలకు ధరి తీస్తుంది. ప్రతీ ఏటా కొన్ని వేల మంది ఉప్పిరితిత్హుల సమస్యలతో మరణిస్తున్నారు.

వాతావరణ మార్పు... అరటి సాగుకు ముప్పు....

వాయు కాలుష్యం నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి, మోటర్ సైకిళ్లు, కార్లు వినియోగాన్ని తాగించాలి. వీలైనంత వరకు, ప్రజా రవాణా మార్గాలైన రైళ్లు, బస్సులో ప్రయాణించడానికి ప్రయత్నించాలి. పెద్ద నగరాల్లో ఉండే జనం, బయటకు వెళ్లే సమయంలో మాస్క్ ను తప్పకుండ వాడాలి. పర్యావరణాన్ని కాపాడటానికి, కాళీ ప్రదేశంలో మొక్కలు నాటాలి. చెట్లు పశుపక్షాదులకు నీడను ఇవ్వడమే కాకుండ పర్యావరణ కాలుష్యానికి ముఖ్య కారణమైన, గాలిలోని కార్బన్ శాతాన్ని తాగిస్తుంది.

Read More.... 

PM- సూర్య ఘర్: ఇక నుండి కరెంటు ఉచితం...

లోకసభ ఎన్నికలు 2024: 17 నిండిన వారు కూడా ఓటర్ ఐడి పొందవచ్చా......

Share your comments

Subscribe Magazine