News

PM- సూర్య ఘర్: ఇక నుండి కరెంటు ఉచితం...

KJ Staff
KJ Staff

భారత దేశంలోని ప్రతి ఇంటిని వెలుగులతో నింపేందుకు మొదలు పెట్టిందే ఈ ప్రధాన మంత్రి ఉచిత కరెంటు యోజన. ప్రధాన మంత్రీ సూర్య ఘర్ స్కీం ద్వారా ప్రతి ఇంటికి సోలార్ పానెల్స్ అమర్చుకునేందుకు, ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుంది. ఇటీవలే విడుదలైన ఈ స్కీం భారీ జనాధారణ పొందుతుందని, ఇప్పటివరకు ఒక కోటి కంటే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయని, ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫారం 'X' వేదికగా తెలియచేసారు. అస్సాం, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్, ఒడిశా, తమిళనాడు, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల నుండి ఎక్కువ ధరఖాస్తులు వస్తున్నాయి అని మోడీ తెలియచేసారు. స్కీం ప్రారంభించిన కొద్దీ కాలానికే ఇంతటి జనాదరణ పొందినందుకు ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం మనం వాడుతున్న విద్యుత్తులో చాల శాతం శిలాజ ఇంధనాల మండించడం ద్వారా లభ్యమవుతుంది. ఇది పర్యావరణాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. సోలార్ ప్యానెల్స్ ద్వారా ఉత్పత్తిఅయ్యే విద్యుత్తును 'పునరుత్పాదక శక్తి' (Renewable Energy) లాగా పరిగణిస్తారు. ఇలా తయారయ్యే విద్యుత్తును, వాడటం వల్ల పర్యావరణం పై ఎటువంటి ఒత్తిడి పడదు, అలాగే సోలార్ ప్యానెల్స్ ఒక్కసారి అమర్చుకుంటే, జీవితాంతం కరెంటు ఉచితంగా వినియోగించవచ్చు.

ప్రధాన మంత్రి ఉచిత కరెంటు యోజనకు అర్హులు ఎవరు? - ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్

ప్రధాన మంత్రి ఉచిత విద్యుత్ యోజన ద్వారా, రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ అమర్చుకునేందుకు, సబ్సిడీల ద్వారా సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. సోలార్ ప్యానెల్స్ కెపాసిటీ బట్టి ఈ సబ్సిడీ నిర్ణయించబడుతుంది. 2kW కెపాసిటీ వరకు 60% సబ్సిడీ, 3kW వరకు 40% సబ్సిడీ లభిస్తుంది. ఈ స్కీం ద్వారా ప్రతీ ఇంటి పై పడే విద్యుతు చార్జీల భారాన్ని తగ్గించొచ్చు అని అలాగే పర్యావరణ సంరక్షణకు ఈ స్కీం ఎంతో దోహదపడుతుందని ప్రధాని ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేసారు.

ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు PM SuryaGhar వెబ్సైటు నుండి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు: https://pmsuryaghar.gov.in

Share your comments

Subscribe Magazine