News

ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ రుణా పరిమితిని 10% పెంచిన నాబార్డ్!

Srikanth B
Srikanth B

ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయంలో ఎలాంటి సమస్య రాకుండా చూడటానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ పరపతి పరిమితిని కూడా నాబార్డ్ 10 శాతానికి పెంచింది.

వ్యవసాయ రంగంలో రైతులకు సహాయపడే బ్యాంకు నాబార్డ్, ఆంధ్రప్రదేశ్ రైతులకు 2022-23 సంవత్సరానికి తన వార్షిక వ్యవసాయ పరపతిని 10 శాతం పెంచింది. బ్యాంకు రూ 1.74 కోట్ల వ్యవసాయ రుణాన్ని ప్రతిపాదించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, తాడేపల్లిలో జరిగిన క్రెడిట్ సెమినార్ సందర్భంగా నాబార్డ్ ఫోకస్ పేపర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నాబార్డ్ అధికారులకు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు.

 

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం సులభతరం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. దీని లో భాగం గ  రైతు భరోసా కేంద్రం, కోల్డ్ స్టోరేజీ, స్టాక్ పాయింట్, విత్తనాల సరఫరా, పురుగుమందుల సరఫరా వంటి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వబడింది. అదే సమయంలో రైతులకు సరైన సమయంలో వ్యవసాయ పనిముట్లను అద్దెకు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తారు. అదే సమయంలో రైతుల వ్యవసాయ ఉత్పత్తులను వారి ఇంటి నుంచి కొనుగోలు చేసేలా కూడా చూస్తారు

సజ్జల ఉత్త్పత్తి పెంచడానికి ప్రమోషన్ పాలసీలను

రైతులు తమ పని పట్ల గర్వపడేలా రైతులకు అన్ని విధాలుగా సహాయం చేయాలని ముఖ్యమంత్రి బ్యాంకులను కోరారు. దేశం యొక్క ఆకలిని అన్నదాతలే తీరుస్తారని  ఆయన అన్నారు. అందువల్ల, అవసరమైన సమయంలో రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకులు నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని అయన అన్నారు ,సజ్జ సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక విధానాన్ని నిర్మిస్తున్నట్లు  ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు.

దక్షిణాది రాష్ట్రాలు వ్యవసాయ పరపతిని ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి ,ఆర్ బిఐ కొత్త నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి దక్షిణాది రాష్ట్రాల్లో 50-55 శాతం వ్యవసాయ  రుణా పరపతిని ఉపయోగిస్తున్నారు.

వరి సాగు చేసే రైతు సోదరులకు అధిక లాభాన్ని ఇచ్చే వరి వంగడాలు !

 

Related Topics

Nabard andrapradesh agriloan

Share your comments

Subscribe Magazine