భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఒలంపిక్స్ లో స్వర్ణం సాధించిన విష్యం తెలిసిందే అయితే ఈ ఏడాది మరల తొలి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫిన్‌లాండ్‌లో జరిగిన కూర్తానె గేమ్స్‌లో నీరజ్ జావెలిన్‌ను 86.69 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ కి జావెలిన్ త్రోయర్ విభాగం లో స్వర్ణ పథకం గెలిచి యావత్ భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన నీరజ్ చోప్రా మరల స్వర్ణం గెలిచారు.ఒలింపిక్స్‌లో మాత్రమే కాకుండా అనేక జావెలిన్ మ్యాచ్‌ల్లో నీరజ్ చోప్రా గొప్ప విజయాలు సాధించి ఎన్నో మెడల్స్ గెలుచుకున్నాడు. ఒలింపిక్స్ తర్వాత మరల ఒక ప్రతిష్టాత్మక టోర్నీలో మళ్లీ మరొక బంగారు పతకం భారత్ ఖాతాలో వేసారు.ఫిన్లాండ్‌లో కౌర్టెన్ గేమ్స్ నిర్వహించబడుతున్నాయి. జావెలిన్ పోటీల్లో పాల్గొన్న నీరజ్ చోప్రా ఈ పోటీల్లో తొలి ప్రయత్నంలోనే నీరజ్ బల్లెంను ఏకంగా 86.96 మీటర్ల దూరం విసరగలిగాడు. ఇది ఈ పోటీల్లో అత్యుత్తమ త్రోగా నిలిచింది.
స్వల్పంగా గాయపడిన నీరజ్ చోప్రా!
జావెలిన్ త్రో పోటీల ఆరంభానికి ముందు విపరీతమైన వర్షం కురిసి గ్రౌండ్ మొత్తం బురదగా మారింది. రన్నప్ ఏరియాలో కూడా నీళ్లు చేరడం వలన అది కాస్త జారుడుగా మారింది. జావెలిన్ త్రోను విసిరే క్రమంలో నీరజ్ చోప్రా జారిపడ్డాడు. దాంతో తనకి స్వల్ప గాయాలు అయ్యాయి అయితే వెంటనే తేరుకున్న నీరజ్ వేణు వెంటనే మరొక త్రోకు సిద్ధమయ్యాడు. తరువాత అతను జావెలిన్ త్రోను 86.69 మీటర్ల దూరం విసిరి పసిడి పతకాన్ని సాధించాడు.
సాధారణంగా జావెలిన్ త్రో పోటీల్లో 6 సార్లు బల్లెంను త్రో చెయ్యవచ్చు.కానీ పోటీలు జరుగుతున్నప్పుడు భారీ వర్షం కారణంగా మూడు త్రోలతోనే ఆపవలసి వచ్చింది.నీరజ్ తర్వాత కెషర్న్ వాల్కట్ రజతం దక్కించుకోగా ఆ తరువాత అండర్సన్ పీటర్స్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.
మరిన్ని చదవండి.
Share your comments