నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం నాగినేనిగుంటలో ఓ వాలంటీర్ అమ్మ ఒడి నగదు చోరీకి పాల్పడిన ఘటన ఇటీవల ప్రజల దృష్టికి వచ్చింది. బాధితురాలు హుస్సేనమ్మ కథనం ప్రకారం.. ఖాసీం పీరా గ్రామంలో వాలంటీర్ బ్యాంకు ఖాతాలను పర్యవేక్షిస్తూ, అవసరమైన వారికి ఆర్థిక సాయం పంపిణీ చేస్తూ తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు.
మహిళ హుస్సేనమ్మకు గతంలో పడవలసిన అమ్మఒడి డబ్బులు తన బ్యాంక్ ఖాతాలో జమ కాలేదు. హుస్సేనమ్మ తన ఖాతాలో డబ్బులు జమ అయ్యయోలేదో అనే విషయాన్ని తెలుసుకోవడానికి వాలంటీర్ వద్దకు వెళ్ళింది. ఆ వాలంటీర్ బ్యాంకు యాప్‌లో అమ్మఒడి జమ కోసం పరిశీలించాడు. అదే సమయంలో ఆ వాలంటీర్ ఆమెకు తెలియకుండానే ఆమె బ్యాంక్ ఖాతా నుండి రూ.3300 డబ్బులను దోచుకున్నాడు. అనంతరం బ్యాంకు వద్దకెళ్లిన బాధిత మహిళ విషయాన్ని గుర్తించి నిలదీశారు.
ఇది కూడా చదవండి..
గుడ్ న్యూస్.. వారికి ప్రతి కుటుంబానికి ఆరోగ్యకార్డుతోపాటు, ఏటా రూ.25 వేలు జమ చేయనున్న ప్రభుత్వం!
ఈ విషయం తెలుసుకున్న వాలంటీర్ దొంగిలించిన రూ.3300 నగదును మల్లి హుస్సేనమ్మ బ్యాంకు ఖాతాలో జమ చేసేసాడు. అదే మహిళ మరొకసారి జులై 4వ తేదీన తన బ్యాంక్ ఖాతాలో ఉపాధి హామీ డబ్బులు జమయ్యాయా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆ వాలంటీర్ వద్దకు వెళ్ళింది. ఆ వాలంటీర్ దగ్గర వేలి ముద్ర వేయగానే ఆమె ఖాతాలో ఉన్న రూ.10 వేలు అమ్మఒడి డబ్బులను కాజేసాడు. విషయం తెలుసుకున్న బాధితురాలు బ్యాంకు స్టేట్మెంట్ తీసింది. నగదు తీసిన తేదీ గుర్తించి వాలంటీర్‌ను నిలదీశారు. ఇలా ఆ వాలంటీర్ ను నిలదీయగా అతను డబ్బులు తీసిన విషయం నిజమేనని ఒప్పుకున్నాడు.
ఇది కూడా చదవండి..
Share your comments