తెలంగాణ రాష్ట్రంలో వచ్చేనెల ఏప్రిల్ 1వ తేదీ నుండి కొత్త విద్యుత్ ఛార్జీలు అమలులోకి రానున్నట్లు ఈఆర్‌సి తెలిపింది. ఈ నేపద్యంలో ఈఆర్‌సి విద్యుత్ సంస్థలకు కావలసిన నిధులు, ఆదాయం, ఖర్చులకు ఆమోదం తెలుపుతూ తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఉత్తర్వులను జారీ చేసింది.
ఈ కొత్త విద్యుత్ ఛార్జీలకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈఆర్‌సి విద్యుత్ రంగం కొరకు తెలంగాణ 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 52,006 కోట్ల 78 లక్షల రూపాయల నిధులు కేటాయించినట్లు తెలిపింది. రాష్ట్రంలో రైతులకు వ్యవసాయం చేసుకోవడానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంది. దీనిలో ఎంటువంటి మార్పు లేకుండా యాధావిధిగా అమలవుతుందని తెలియజేసారు.
ఉత్తర్వుల్లో ఈఆర్‌సి విద్యుత్ కొనుగోలులో రూ. 4.39 పైసలకు యూనిట్ ధర తగ్గిందని తెలిపింది. విద్యుత్తు సబ్సిడీ కింద కొత్త ఆర్థిక సంవత్సరంలో 9వేల 124 కోట్ల 22 లక్షల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం భరించిందని ఈఆర్‌సి తెలియజేసింది. వీటిలో 7743 కోట్ల 80 లక్షల రూపాయలను వ్యవసాయ రంగానికి సబ్సీడీలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది.
తెలంగాణ ప్రభుత్వం గృహ విద్యుత్‌పైన 1381 కోట్ల 2 లక్షల రూపాయల సబ్సిడీలను భరిస్తుందని ఈఆర్‌సి తెలిపింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ప్రభుత్వం ఈ సంవత్సరం సుమారుగా 11 శాతం అదనంగా విద్యుత్ సబ్సిడీలను భరించనుంది.
ఇది కూడా చదవండి..
కొత్త విద్యుత్ ఛార్జీలు..
గృహ వినియోగం
మొదటి 50 యూనిట్ల వరకు - ఒక్కో యూనిట్ ధర ఒక రూ.1.95 పైసలు
51 నుండి 100 యూనిట్ల వరకు - ఒక్కో యూనిట్ ధర రూ. 3.10 పైసలు
100 నుండి 200 యూనిట్ల వరకు - మొదటి వంద యూనిట్లకు ఒక్కో యూనిట్ ధర రూ. 3.40, 101నుండి 200 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 4.80.
200 యూనిట్లకు మించి - మొదటి 200 యూనిట్ల వరకు ఒక్కో యూనిట్ ధర రూ. 5.10
201 నుండి 300 యూనిట్ల వరకు - ఒక్కో యూనిట్ ధర రూ. 7.70 పైసలు
301 నుంచి 400 యూనిట్ల వరకు - ఒక్కో యూనిట్ ధర రూ. 9
401 నుంచి 800 యూనిట్ల వరకు - ఒక్కో యూనిట్ ధర రూ. 9.50 పైసలు
800 యూనిట్లకు మించి - ఒక్కో యూనిట్ ధర రూ. 10
ఇది కూడా చదవండి..
గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..ఎల్పీజీ సిలిండర్ పై రూ.200 సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు
వాణిజ్య రంగం
మొదట 50 యూనిట్ల వరకు - ఒక్కో యూనిట్ ధర రూ. 7
మొదటి 100 యూనిట్ల వరకు - ఒక్కో యూనిట్ ధర రూ. 8.50 పైసలు
101 నుండి 300 యూనిట్ల వరకు - ఒక్కో యూనిట్ ధర రూ. 9.95 పైసలు
301 నుండి 500 యూనిట్ల వరకు - ఒక్కో యూనిట్ ధర రూ. 11
ఇది కూడా చదవండి..
Share your comments