News

గ్యాస్ వినియోగదారులకు శుభవార్త..ఎల్పీజీ సిలిండర్ పై రూ.200 సబ్సిడీ మరో ఏడాది పొడిగింపు

Gokavarapu siva
Gokavarapu siva

దేశంలో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. వాణిజ్యానికి వాడే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలతో పాటు వంటకు ఇంట్లో వినియోగించే డొమెస్టిక్‌ గ్యాస్ సిలిండర్‌ ధరలు కూడా పెరిగాయి.పెరిగిన ఈ గ్యాస్ సిలిండర్ ధరలు పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు భారంగా మారింది. పెరిగిన గ్యాస్ సైసిన్దెర్ ధరల ఈ నెల 1వ తేదీ నుండి అమలులోకి వచ్చాయి.

ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం వినియోగదారులకు శుభవార్త చెప్పింది. ఈ ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం వినియోగదారులకు దీని ద్వారా ఎల్పీజీ సిలిండర్ పై రూ.200 సబ్సిడీని అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఇచ్చే సబ్సిడీని మరొక సంవత్సరం పొడిగిస్తున్నట్లు వినియోగదారులకు తెలిపింది.

ప్రధాని మంత్రి ఉజ్వల యోజక పథకాన్నీ 2016లో ప్రజలకు అందుబాటులోకి కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టడానికి ముఖ్య లక్ష్యం వచ్చేసి, దేశంలో పేద మరియు మధ్య తరగతి కుటుంబాలకు ఎల్పీజీ అందుబాటులోకి తీసుకురావడం. ఈ పథకం కింద 2019-20లో ఎల్పీజీ వినియోగం అనేది 3.01 రీఫిల్స్ ఉండగా, 2021-22 సంవత్సరానికి అది 3.68కు చేరింది. సబ్సిడీలకు ఈ పథకం కింద ఉన్న లబ్ధిదారులందరూ అర్హులే.

ఇది కూడా చదవండి..

మహిళలకు శుభవార్త: నేడే మహిళల ఖాతాలో .. వైఎస్సార్ ఆసరా డబ్బులు

ప్రధాని మంత్రి ఉజ్వల యోజక పథకం కింద ఈ సంవత్సరం మర్చి 1వ తేదీకి 9.6 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 2022-23 ఆర్ధిక సంవత్సరానికి ఈ పథకానికి వ్యయం రూ.6,100 కోట్లు పెట్టారు. కానీ ఈ సంవత్సరం దీనిని పెంచుతూ 2023-24 ఆర్ధిక సంవత్సరానికి ఈ పథకానికి వ్యయం వచ్చేసి రూ.7,680 కోట్లు ఉంటుందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.

దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 9.6 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని మంత్రి చెప్పారు. ఈ పథకం లబ్ధిదారులకు 14.2 కిలోల సిలిండర్కు రూ. 200 సబ్సిడీని ఏడాదికి 12 రీఫిల్స్కు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. డబ్బులు అనేవి అర్హులైన వారి ఖాతాల్లో నేరుగా జమ అవుతుంది.

ఇది కూడా చదవండి..

మహిళలకు శుభవార్త: నేడే మహిళల ఖాతాలో .. వైఎస్సార్ ఆసరా డబ్బులు

Related Topics

gas cylinder subsidy

Share your comments

Subscribe Magazine