ప్రతీ సంవత్సరం కొన్ని లక్షల మంది ఉద్యోగాల కోసం, చదువుల కోసం విదేశాలకు వలస వెళ్తున్నారు. ఈ దేశాల్లో యూకే మరియు అమెరికాకు వెళ్లే విద్యార్థుల సంఖ్యా చాల ఎక్కువ. చదువుల కోసం యూకే వెళ్లే విద్యార్థులు, తమ చదువు పూర్తయ్యాక ఉద్యోగాల్లో స్థిరపడి తమ తల్లితండ్రులను, కుటుంబ సభ్యులను వారితోపాటు విదేశాలకు తీసుకువెళ్లాలి అనే ఆలచనతో ఉంటారు, దీని కోసం కుటుంబ వీసా పొందవలిసిన అవసరం ఉంటుంది. ఇప్పటి నుండి యూకే లో కుటుంబ వీసాను పొందడం మరింత కష్ట తరంకానుంది
విలాసవంతమైన జీవితం, అధిక ఉద్యోగ వేతనం లభిస్తుందన్న ఆలోచనతో, తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్న ఆశతో ఎంతో మంది తల్లితండ్రులు తమ పిల్లలను విదేశాలకు పంపించడం మనం చూస్తున్నాం. విదేశాలకు వెళ్లే విద్యార్థులు కూడా, చదువు పూర్తిచేసి తమ తల్లితండ్రులను విదేశాలకు తీసుకువెళ్లాలి అనే ఆలోచనతో ఉంటారు. ఈ విధంగా విదేశాలకు వెళ్లి స్థిరపడే వారి సంఖ్యా చాల ఎక్కువుగా ఉంటుంది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి, కొన్ని దేశాల ప్రభుత్వాలు ఎన్నో ఆంక్షలు విధిస్తున్నాయి.
తాజాగా బ్రిటన్ ప్రభుత్వం యూకే కుటుంబ వీసా పొందేందుకు అవసరమైన వార్షికవేతన పరిమితిని ఒకేసారి 55% పెంచింది. పోయిన గురువారం నుండి ఈ నిబంధన అమలులోకి వచ్చింది. ఈ ఏడాది నుండి ఎవరైనా కుటుంబ వీసా స్పాన్సర్ చెయ్యాలనుకుంటే, వారి వార్షిక వేతనం కనీసం 29,000 బ్రిటన్ పౌండులు ఉండాలని స్పష్టం చేసింది. ఇప్పటివరకు 18,600 బ్రిటన్ పౌండులుగా ఉన్న ఈ పరిమితిని ఒకేసారి 55% పెంచి 29,000 బ్రిటన్ పౌండులుగా మార్చారు. వచ్చే సంవత్సరం నుండి ఈ పరిమితి 38,700 బ్రిటన్ పౌండులు ఉండబోతుందని అధికారులు తెలియచేసారు. దేశంలోకి విపరీతంగా పెరుగుతున్న వలసలను నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. కొత్త నిబంధనలు మూలంగా పెరుగుతున్న వలసలను నియంత్రించవచ్చని అక్కడి అధికారులు భావిస్తున్నారు.
Share your comments