News

చిన్నారులే లక్ష్యంగా.... విజృంభిస్తున్న టమాటా ఫ్లూ...!

S Vinay
S Vinay

అందుతున్న సమాచారం ప్రకారం, 80 మందికి పైగా చిన్నారులు ఈ టమాటా ఫ్లూ వ్యాధితో బాధపడుతున్నారు. అన్ని కేసులు పొరుగున ఉన్న కేరళ లోని కొల్లం జిల్లా నుండి నమోదయ్యాయి.

టొమాటో ఫ్లూ అంటే ఏమిటి?
ఇది అరుదైన వైరల్ వ్యాధి, ఇది సోకిన తర్వాత చర్మం పై ఎరుపు రంగు దద్దుర్లు, టమాటాల లాగా కనిపించే బొబ్బల కారణంగా ఈ వ్యాధికి ఆ పేరు వచ్చింది. ప్రస్తుతం కేరళలో ఐదేళ్లలోపు పిల్లలపై ఈ టమాటా జ్వరం వణికిస్తోంది.

ట‌మోటా ఫీవ‌ర్ వ్యాప్తిపై కేరళ పొరుగు రాష్ట్రం త‌మిళ‌నాడులోనూ ఆందోళ‌న నెల‌కొన్న‌ది. దీంతో స‌రిహ‌ద్దు జిల్లాల్లో ప‌రీక్ష‌లు నిర్వహిస్తున్నారు.త‌మిళ‌నాడు, కేర‌ళ బోర్డ‌ర్ వ‌ద్ద ఈ టమాటా ఫ్లూ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారిని గుర్తించడానికి చర్యలు చేపట్టారు. ప్రయాణీకులను తనిఖీ చేయడానికి,ముఖ్యంగా చిన్నారులకై ఇద్దరు వైద్య అధికారులు బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.

అంతే కాకుండా అంగన్‌వాడీల్లో ఐదేళ్లలోపు పిల్లలను తనిఖీ చేసేందుకు 24 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు.

వ్యాధి యొక్క లక్షణాలు
ఈ వ్యాధికి గురైన బాధిత చిన్నారికి ఎరుపు రంగులో ఉండే టొమాటోల పరిమాణంలో బొబ్బలు వస్తాయి. దాంతో పాటు అధిక జ్వరం, శరీర నొప్పి, కీళ్ల వాపు, కడుపులో తిమ్మిర్లు, వికారం, వాంతులు, విరేచనాలు, చేతులు, మోకాలు నొప్పులు , దగ్గు, తుమ్ములు మరియు ముక్కు కారటం వంటి లక్షణాలు ఉంటాయి.

ఈ వ్యాధి వైరల్ ఫీవర్ లేదా చికున్‌గున్యా లేదా డెంగ్యూ జ్వరం యొక్క ప్రభావమా అనే చర్చ జరుగుతోంది. ఈ వ్యాధి కేరళలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుండగా, నివారణ చర్యలు తీసుకోకుంటే వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని ఆరోగ్య అధికారులు హెచ్చరిస్తున్నారు.

కరోనా సృష్టించిన ప్రళయం తో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రజలకి ఈ టమాటా ఫ్లూ మరింత ఆందోళనలకు గురి చేస్తుంది.

మరిన్ని చదవండి.

భారత్ లో కరోనా మరణాలు 47 లక్షలు అంటున్న WHO...వ్యతిరేకిస్తున్న భారత్!

Related Topics

tomato flu kerala

Share your comments

Subscribe Magazine