కృషి జాగరణ్ ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన MFOI 2024 అవార్డుల కార్యక్రమానికి జ్యూరీ చైర్మన్ గా, NITI ఆయోగ్ సభ్యులు. ప్రో. రమేష్ చాంద్ నియమితులయ్యారు. ఈ మహత్తర కార్యక్రమానికి అద్యక్షత వహించడం తనకు చాల గర్వకారణమని రమేష్ చాంద్ తెలిపారు.
ప్రారంభించిన నాటినుండి కృషి జాగారం రైతుల కోసమే పనిచేస్తూ వారి అభ్యున్నతికి నిరంతరం పాటుపడుతూ వస్తుంది. 27 ఏళ్ల నుండి రైతులకోసం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ, వ్యవసాయ పురోగతికి నిరంతరం శ్రమిస్తోంది. ఈ ద్రోవ లోనే కృషి జాగరణ్ మిలియన్ ఫార్మర్ ఆఫ్ ఇండియా కార్యక్రమాన్ని మొదలుపెట్టిన తర్వాత ఎన్నో అపూర్వ విజయాలను సొంతం చేసుకుంది. ప్రారంభించిన ఒక ఏడాదిలో భారత దేశంలోని ఎంతో మంది రైతులకు మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా (MFOI) అవార్డులతో సత్కరించింది. గత ఏడాది ప్రారంభించిన ఈ కార్యక్రమం యొక్క విజయం తరువాత తిరిగి ఈ ఏడాది MFOI 2024 అవార్డులను మీ ముందుకు తీసుకువస్తుంది. భారత దేశంలోని లక్షాధికారి రైతుల నుండి నామినేషన్లు స్వీకరించి, ఎంపికైన వారికి మిల్లియనీర్ ఫార్మర్ ఆఫ్ ఇండియా పురస్కారాలతో సత్కరిస్తుంది.
2024 లో అదించబోయే MFOI 2024 అవార్డ్స్ జ్యూరీ సభ్యులను నియమించింది. ఈ జ్యూరీ చైర్మన్ గా NITI ఆయోగ్ సభ్యులు ప్రో. రమేష్ చాంద్ వ్యవహరించనున్నారు.భారతీయ వ్యవసాయం స్థితిగతులు మార్చాలన్న గొప్ప సంకల్పంతో కృషి జాగరణ్ వ్యవస్థాపకులు ఎం.సి. డొమినిక్ మరియు షైనీ డొమినిక్ ఈ MFOI అవార్డు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి మహీంద్రా ట్రాక్టర్స్ స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ICAR) ఈ కార్యక్రమానికి నాలెడ్జి పార్ట్నేర్స్ గా నిరవహించడం గర్వకారణం.
ఇటువంటి ప్రత్యేక కార్యాక్రమాన్ని తనని జ్యూరీ చైర్మన్ గా నియమించినందుకు ప్రెఫెసర్. రమేష్ చాంద్, కృషి జాగరణ్ వ్యవస్థాపకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, భారత దేశంలో రైతుల కోసం ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం ఇదే మొదటిసారని అయన మాట్లాడారు. ఇప్పటివరకు వ్యవసాయం అంటే కేవలం బాధలు, నష్టాలు మాత్రమే ఉంటాయని భావించే వారందిరికి ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయ లో విజయాలతో కూడుకున్న కోణాన్ని ప్రపంచానికి చాటిచెపొచ్చని అయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రైతుల్లో ప్రేరణ స్ఫూర్తిని నింపి ఉజ్వల వ్యవసాయ భవిష్యత్తుకు కొత్త ఆశలు చిగురిమ్పచేసి వారిని విజయ తీరాలా వైపు సాగేలా చేయగలమని నమ్మకం వ్యక్తం చేసారు.
ఈ మధ్యకాలంలో ఎంతో మంది యువత వ్యవసాయంలోని గొప్పదనాన్ని గుర్తించి ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలో ఇటువంటి కార్యాక్రమాలు వారి బాటలు మెరుగైన మార్గాన్ని ఏర్పాటుచేయడంలో తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేసారు. వ్యవస్య ఉత్పాదకతను పెంచి రైతుల ఆద్యం రేటింపు చెయ్యడంలో ఈ MFOI అవార్డులు తోడ్పడతాయని మాట్లాడారు.
Share your comments