News

Breaking News: లోకసభ ఎన్నికలకు నామినేషన్స్ ఈ రోజుల్లోనే...

KJ Staff
KJ Staff

దేశంలో తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయ్యింది. మొత్తం 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని, 102 ఎంపీ స్థానాలకు, మొదటి దశలో ఎన్నికలు జరగనున్నాయి. మార్చ్ 27 వరకు, ఎంపీ అభ్యర్థుల నుండి నామినేషన్స్ స్వీకరిస్తామని ఎలక్షన్ కామిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఒక్క బీహార్లో మాత్రం పండుగను దృష్టిలో పెట్టుకొని, మార్చ్ 28 వరకు నామినేషన్స్ స్వీకరణను పొడిగించారు. నామినేషన్ల పరిశీలన 28 న ఉంటుంది. నామినేషన్స్ ఉపసంహరించుకుందాం అనుకునే అభ్యర్థులకు మార్చ్ 30 వరకు సమయం ఉంటుంది.

లోకసభ ఎన్నికలు మొత్తం 7 ఫేసులో జరుగుతాయి. ఏప్రిల్ 19 నుండి జూన్ 1 వరకు కొనసాగే ఎలెక్షన్ల పర్వం దేశంలోని వేర్వేరు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కొనసాగనుంది. మొదటి దశ ఎలక్షన్స్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం,బీహార్, ఛత్తీస్గఢ్, మధ్య ప్రద్రేశ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, జమ్మూకాశ్మీర్, లక్షద్వీప్, పుదుచ్చేరి ప్రాంతాల్లో జరగనున్నాయి.

Read More:

లోకసభ ఎన్నికలు 2024: 17 నిండిన వారు కూడా ఓటర్ ఐడి పొందవచ్చా......

దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో లోకసభ ఎన్నికలతో పాటు, పార్లిమెంట్ ఎన్నికలు కూడా ఏకకాలంలో జరగనున్నాయి. ఆంధ్ర ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్లో, రెండు ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి. భద్రత చర్య రీత్యా జమ్మూ కాశ్మీర్లో రెండు ఎన్నికలను ఒకేసారి ఎలక్షన్స్ నిర్వహించడం వీలుకాదు.

ఎన్నికలు న్యాయబద్ధంగా, మరియు పరిదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అనేక చర్యలను చేపట్టింది. ఎన్నికల నియమాలకు ఎవరైనా భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎన్నికల సంగం హెచ్చరికలు జారీ చేసింది.

Share your comments

Subscribe Magazine