News

రైతులకు గమనిక.. పీఎం కిసాన్ డబ్బులు పొందాలంటే ఈ నెల 30లోపు ఇలా చేయండి.. లేదంటే డబ్బులు రావు!

Gokavarapu siva
Gokavarapu siva

దేశంలోని రైతుల ఆర్థిక సహాయం కోసం భారత ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను అమలు చేస్తోంది. ప్రతి ఏటా 6 వేల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాలకు వాయిదాల్లో వేస్తున్నారు. ఈ పథకం ప్రకారం, ప్రభుత్వం ప్రతి 4 నెలల వ్యవధిలో 3 విడతలుగా రైతుల ఖాతాలకు రూ.2,000 జమ చేస్తున్నారు. 2019 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 14 వాయిదాలను రైతుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేసింది. ప్రస్తుతం 15వ విడత ఎప్పుడెప్పుడా అని రైతులు ఎదురు చూస్తున్నారు.

అయితే రైతులకు ఇది ముఖ్యమైన గమనిక అనే చెప్పాలి. పీఎం కిసాన్ స్కీమ్ కింద ప్రయోజనం పొందుతున్న అన్నదాతలు కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే. ఈ పథకం యొక్క డబ్బులను పొందాలంటే లబ్ధిదారులు కచ్చితంగా ఇకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి అని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసిన విషయం మనకి తెలిసిందే. ఇకేవైసీ చేయకపోతే రైతులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం కిసాన్ డబ్బులు అందవు అని ప్రభుత్వం తెలిపింది.

మరొకవైపు ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రభుత్వం సూచనలను జారీ చేసింది , తదుపరి విడత రైతు భరోసా డబ్బులు నేరుగా రైతుల ఖాతాలో జమ కావాలంటే రైతులు ekyc ప్రక్రియ పూర్తి చేయాలనీ రైతులను ఆదేశించింది . లేనిపక్షంలో రైతుల ఖాతాలో తదుపరి విడత రైతు భరోసా డబ్బులు జమ కావని సూచించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 3.13 లక్షల రైతుల ఖాతాలు ఈ-కేవైసీలు పెండింగ్ లో ఉన్నాయని… వాటిని త్వరగా పూర్తిచేయాలని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఇది కూడా చదవండి..

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..నేడు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న ప్రభుత్వం..!

పీఎం కిసాన్ డబ్బులతో కలిపి రైతు భరోసా ఇస్తున్న ప్రభుత్వం ప్రతి విడతకు ఈ-కేవైసీ ఉంటేనే రైతులకు నిధులు విడుదల చేస్తామని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో ఈ నెలాఖరు లోగా రైతుల బ్యాంకు ఖాతాలకు ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లకు సిఎస్ సూచించారు. ఇప్పటివరకు 38.56 లక్షల మంది రైతుల ఖాతాలకు ఈ-కేవైసీ పూర్తయింది. మిగిలిన రైతుల ekyc ప్రక్రియ పూర్తి చేయాలనీ ఆదేశాలు జారీ చేసారు.

ఇంకా పీఎం కిసాన్ స్కీమ్‌ కింద బెనిఫిట్ పొందుతూ ఇకైవేసీ పూర్తి చేసుకొని రైతులు ఎవరైనా ఉంటే కచ్చితంగా ఈ నెల చివరి కల్లా ఆ పని పూర్తి చేసుకోవాలి. లేదంటే మాత్రం ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30 లోపు ఇకేవైసీ చేసుకోకపోతే బ్యాంక్ అకౌంట్లలోకి డబ్బులు రాకపోవచ్చు.

అంతేకాకుండా కొన్ని నివేదికల ప్రకారం చూస్తే.. వచ్చే నెలలోనే రైతుల అకౌంట్లలోకి డబ్బులు రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. పండుగ సీజన్‌ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈసారి రైతులకు ముందే డబ్బులు అందించొచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు.

ఇది కూడా చదవండి..

ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..నేడు వారి ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్న ప్రభుత్వం..!

Share your comments

Subscribe Magazine

More on News

More