News

డ్రైవింగ్ లైసెన్స్: ఇక ఆర్టీఓ అవసరం లేకుండానే డ్రైవింగ్ లైసెన్స్

KJ Staff
KJ Staff


మన దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే చాల పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ముందుగా స్టేట్ ఆర్టీఓ వెబ్సైటు లో లేదా కేంద్ర ప్రభుత్వం వాహన్ పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి, తరువాత వారు పెట్టె పరీక్ష రాసి, తర్వాత డ్రైవింగ్ టెస్ట్ స్లాట్ బుక్ చేసుకుని, నిర్ణిత తేదీన ఆర్టీఓ ఆఫీస్ కి వెళ్లి వాహనం నడిపి చూపించాలి. ఈ ప్రాసెస్ మొత్తం పూర్తికావడానికి కనీసం 2-3 నెలలైనా సమయం పడుతుంది. అయితే ఈ అవస్థను తగ్గించి, డ్రైవింగ్ లైసెన్స్ త్వరగా జారీచేసేందుకు కొత్త పద్ధతి అమలులోకి రాబోతుంది. ఈ కొత్త పద్ధతి జూన్ 1 నుండి అమల్లోకి రానున్నది.

డ్రైవింగ్ లీసెన్స్ జారీ చెయ్యడంలో ఎంతో సమయం పడుతుంది. ఈ ఆలస్యాన్ని తగ్గించి తొందరగా లైసెన్స్ జారీచెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చెయ్యబోతుంది. ఇంకా నుండి డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీఓ ఆఫీసుకు వెళ్ళవలసిన అవసరం లేకుండా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే డ్రైవింగ్ స్కూల్ లోనే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. ఈ కొత్త నిబంధనలు జూన్ 1వ తారీఖు నుండి అమలులోకి రానున్నాయి.

అయితే మన దేశంలో వీధికొక డ్రైవింగ్ స్కూల్ ఉంది, వీటన్నిటిలో శిక్షణ పొంది డ్రైవింగ్ లైసెన్స్ పొందచ్చ అంటే లేదు. డ్రైవింగ్ లైసెన్స్ జారీ చెయ్యాలంటే సంబంధిత డ్రైవింగ్ స్కూల్ కి తగిన శిక్షణ సదుపాయాలు ఉండాలి. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీచేసింది. ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండే డ్రైవింగ్ స్కూళ్లకే లైసెన్స్ జారీచేసే అధికారం వస్తుంది.

ఈ నిబంధనల ప్రకారం డ్రైవింగ్ స్కూల్ కనీసం ఒక ఎకరం విస్తీర్ణంలో ఉండాలి. డ్రైవింగ్ టెస్ట్ నిర్వహించడానికి అవసరమైన సదుపాయాలన్నీ ఉండాలి. డ్రైవింగ్ స్కూల్ లోని ట్రైనర్లకు కనీసం డిప్లొమా లేదా అందుకు సమానమైన విద్యార్హత కలిగివుండటం అవసరం, మరియు కనీసం 5 ఏళ్ల డ్రైవింగ్ శిక్షణ అనుభవం ఉండటం ముఖ్యం. ట్రైనర్ కి బయోమెట్రిక్ వంటి సాంకేతికతపై అవగాహనా ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ పొందటానికి ముందు కనీసం 4 వారాలు శిక్షణ పొందాలి, దీనిలో ఎనిమిది గంటల థియరిటికల్ శిక్షణ మరియు 21 గంటల ప్రాక్టికల్ శిక్షణ పొందవలసిన అవసరం ఉంది.

Share your comments

Subscribe Magazine

More on News

More