News

"10 వ తరగతి అర్హతతో డ్రోన్ పైలెట్ గ మారవచ్చు "-DFI ప్రెసిడెంట్ స్మిత్ షా

Srikanth B
Srikanth B
DFI (డ్రోన్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ) ప్రెసిడెంట్ "స్మిత్ షా" కృషి జాగరణ్ తో
DFI (డ్రోన్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ) ప్రెసిడెంట్ "స్మిత్ షా" కృషి జాగరణ్ తో

వ్యవసాయ ఆధునీకరణ లో భాగం గ వ్యవసాయ రంగంలో సాంకేతికతో పని చేయవలసిన అవసరం ఎంతయినా ఉంది , వాటిలో ముఖ్యమైన అంశం వ్యవసాయ రంగం లో డ్రోన్ ల వినియోగం ఇదే అంశం పై చర్చించడానికి DFI (డ్రోన్ ఫెడరేషన్ అఫ్ ఇండియా ) ప్రెసిడెంట్ "స్మిత్ షా" కృషి జాగరణ్ నిర్వహించిన KJ చౌపాల్ కు హాజరయ్యారు . ఈ సందర్భంగ ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగం డ్రోన్ ల ప్రాముఖ్యత విశేషమైనది రానున్న కలం లో ఇది కూలీలా కొరతను అధిగమిచడం తో పాటు రైతుల యొక్క విలువైన సమయాన్ని , నీటిని , సరైన మోతాదులో రసాయన మందుల పిచికారి దోహదం చేస్తుందని అన్నారు .

అదేవిధం గ గ్రామీణ ప్రాతాలలో ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయని కేవలం 10 వ తరగతి చదివిన రైతు (లేదా ) యువకులు 5 రోజుల డ్రోన్ పైలెట్ కోర్సులో శిక్షణ తీసుకొని డ్రోన్ పైలెట్ లైసెన్స్ పొందవచ్చని తద్వారా ఉపాధి పొందవచ్చని , అర్హత కల్గిన ఔత్సాహికులు
https://digitalsky.dgca.gov.in/home వెబ్ సైట్ ద్వారా దరకాస్తు చేసుకోవచ్చని , డ్రోన్ లను వినియోగించడానికి మరి ఏ ఇతర అనుమతులు గని లైసెన్స్ లు గని అవసరం లేదని ఆయన వెల్లడించారు.

డ్రోన్ ల సబ్సిడీ గురించి మాట్లాడుతూ ;

వ్యవసాయ విశ్వ విద్యలయాలకు , కృషి విజ్ఞాన్ కేంద్రంకు 100 శాతము సబ్సిడీ మీద వీటిని అందిస్తున్నట్లు ,
FPO, సహకార సంఘాలకు 75 శాతం సబ్సిడీ మీద అందిస్తున్నట్లు ,
CHC , ఔత్సాహికులైన గ్రామీణ ఎంట్రోప్రెన్యూర్స్ ( చిన్న వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారు ) కి 40 శాతము సబ్సిడీ మీద 90
శాతము అగ్రి ఇన్ ఫ్రా ఫండ్ క్రింద బ్యాంకు లోన్ ద్వారా కూడా రైతులు డ్రోన్ లను కొనుగోలు చేయవచ్చని అయన తెలిపారు .

పురుగుల మందు హానికరం అని తెలిసి కూడా మరో గత్యంత్రం లేక రైతు కూలీలు పిచికారీ చేస్తున్నారని , ప్రమాదకర పురుగు మందులలను పిచికారీ చేయడం లో కీలక పాత్ర పోషించనున్నట్లు తెలిపారు .

తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సంబరాలకు సిద్దమైన రాష్ట్రం !

Share your comments

Subscribe Magazine