మార్కెట్ లో అధిక ధరలను చూసి పంట సాగు చేసిన రైతులకు పంట చేతికి వచ్చాక కన్నీరే మిగులు తుంది , పంట అధిక ధర పలికి లాభాలు పొందవచ్చు అనే ఆశ ఆశ గానే మిగిలి పోతుంది . కోస్తున్నపుడు కన్నీరు తెపించే ఉల్లి పంట అమ్మకానికి వెళ్లిన రైతులకు కూడా కన్నీరు తెపిస్తుంది .
వివిధ ప్రాంతాల నుంచి ఉల్లి పంట ఒకే సరి మార్కెట్ కు రావడంతో ఒక్కసారిగా ధరలు పడిపోయాయి దీనితో పెట్టిన పెట్టుబడి కూడా కూడా వచ్చే అవకాశము లేకపోవడంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు .
. 2 వేల వరకు ఉండే క్వింటాల్ ఉల్లి ధర ఒక్కసారిగా 600 నుంచి 1000 రూపాయలకు పడి పోయింది. మార్కెట్ కమిటి చైర్మన్ తో పాటు దళారులు , వ్యాపారులు కుమ్మక్కై ధర రాకుండా చేస్తున్నారని రైతులు మండి పడుతున్నారు. దేవరకద్ర మార్కెట్ లో ఉల్లికి మంచి డిమాండ్ ఉంటుంది. మహబూబ్ నగర్, నారాయ ణపేట, ఆత్మకూర్, మక్తల్, కోస్గి, జడ్చర్ల, కొత్తకోట మండలాల రైతులు, పెద్ద ఎత్తున పంటను తీసుకొస్తున్నారు. అయితే వారం రోజులుగా నాణ్యతను బట్టి క్వింటా ఉల్లికి కనిష్ఠంగా 600 , గరిష్ఠంగా 1000 ధర పలుకుతోంది. ధరల పతనం తమను ముంచేస్తుందని ఉల్లి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .
పడిపోయిన పత్తి ధరలు.. ఆందోళనలో రైతులు
గత ఏడాది ఉల్లి ధరలు ఎక్కువగా ఉండడంతో రైతులు పంటను భారిగ సాగు చేసారు . మార్కెట్ కు ఒక్కసారిగా పంట రావడంతో 2 వేల వరకు ఉండే క్వింటాల్ ఉల్లి ధర ఒక్కసారిగా 600 నుంచి 1000 రూపాయలకు పడి పోయింది. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో మాత్రం ఉల్లి ధర బాగానే పలుకుతోంది.. ఇప్పటికే కిలో ఉల్లి నాణ్యతను బట్టి రూ.20, రూ.25, రూ.30కి విక్రయిస్తున్నారు. మొత్తంగా ఓ వైపు రైతుకు.. మరో వైపు వినియోగదారుడికి తిప్పలు తప్పడం లేదు అయితే దింట్లో వ్యాపారాలు మాత్రం భారిగా లాభాలు పొందుతున్నారు .
Share your comments