దేశంలో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. కూరగాయల నుండి బియ్యం వరకు అన్నిటి ధరలు భారీగా పెరికిపోయాయి. ప్రజలు ఈ నిత్యావసర సరుకులను కొనుగోలు చేయాలంటేనే వంద సార్లు ఆలోచిస్తున్నారు, ఎందుకంటే ధరలు అంతలా పెరిగిపోయాయి. ఇటీవలి కాలంలో టమోటా, మిర్చి, అల్లం మరియు బియ్యం ధరలు విపరీతంగా పెరిగాయి. టమోటాలు ఐతే ఎన్నడూ లేని విధంగా ఆల్ టైం రికార్డ్స్ సృష్టించింది.
ఇప్పటికే చాలా మార్కెట్లలో టామోటా ధర కేజీకి 200కి పైగా ఉంది. హోల్ సేల్ వ్యాపారాల అంచనా ప్రకారం ఆగస్టులోనూ టమాటా ధరలు తగ్గే అవకాశం లేదన్నారు. పైగా వీటి ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఈ ధరలు ఇంతలా పెరగడానికి కారణం ఏమిటంటే, చాలా రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు టమాటా తోటలతో పాటు, పలు కూరగాయల పంటలకు నష్టం జరిగింది. ఈ కారణంగా దిగుబడి తగ్గింది, కానీ డిమాండ్ తగ్గలేదు. దీనితో ధరలు బాగా పెరిగిపోయాయి.
ప్రస్తుతం వ్యాపారులు ఉల్లిపాయలు కూడా టమోటా దారినే నడవనున్నట్లు చెబుతున్నారు. త్వరలో ఉల్లిపాయలు పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ నెలాఖరుకు ఉల్లి కేజీ రూ.60 నుంచి రూ.70కి చేరవచ్చనే సంకేతాలు ఉన్నాయి. బియ్యం ధరలు కూడా పెరుగుతాయి అంటున్నారు. అంటే.. ముందుంది మరింత కష్టకాలం అన్నమాట.
ఇది కూడా చదవండి..
గుడ్ న్యూస్! భారీగా తగ్గిన టమాటా ధరలు.. కిలోకు రూ.50 పతనం
ప్రజలు ఈ సంవత్సరం జనవరి- మే నెలల మధ్య ఉల్లిపాయల ధరలు తగ్గినందున కొంత మేరకు ఉపశమనం పొందారు. ఆగస్టు మొదటి వారంలోనూ ఉల్లి ధరలు కేజీ 25-35 రూపాయల మధ్య ఉన్నాయి. కానీ ఈ నెలాఖరుకు ఉల్లి కేజీ రూ.60 నుంచి రూ.70కు చేరుకోవచ్చు. అక్టోబర్‌లో ఖరీఫ్ పంట చేతికి వచ్చిన తరువాతే ఉల్లిగడ్డల ధరలు దిగి వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
టమోటాలను అంటే నిల్వ చేయడం కష్టం కానీ, ఉల్లిపాయలు సుమారుగా 2 నెలల వరకు నిల్వ ఉంటాయి. కాబట్టి ప్రజలు ధరలు పెరగక ముందే తమకు కావలసిన ఉల్లిపాయలను కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం మంచిది. కాకపోతే ఉల్లిపాయలు పాడైపోకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇది కూడా చదవండి..
Share your comments