News

ఆంధ్ర ప్రదేశ్ లో తగ్గిన వరి సాగు ... ఇప్పటికి సాగు అయ్యింది 9 లక్షల ఎకరాలు మాత్రమే

Srikanth B
Srikanth B
paddy cultivation dropped in AP
paddy cultivation dropped in AP


ఆంధ్ర ప్రదేశ్ లో తగ్గిన వరి సాగు ...

ఆంధ్ర ప్రదేశ్ లో నెమ్మదించిన వరి సాగు ఇప్పటికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 64 శాతం సాగు పూర్తి కావల్సి ఉండగా ఇప్పటికి కేవలం 41 శాతము మాత్రమే సాగు జరిగింది , సీజన్ లో ఇప్పటికి 4.9 లక్షల హెక్టార్లలో సాగు జరగాల్సివుండగా 3. 7 లక్షల హెక్టార్లలో సాగు పూర్తయింది ఇదే సమయానికి గత సంవత్సరం 4. 1 హెక్టార్లలో సాగు అయింది . చలి తీవ్రత కారణంగా సాగు నెమ్మదించినట్లు వ్యవసాయ అధికారులు భావిస్తున్నారు .

రబి సీజన్ మొత్తానికి ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తముగా 8. 1 హెక్టార్లలో సాగు వరి సాగు జరగాల్సి వుంది , అయితే ప్రస్తుతం వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం సాగు తగ్గే అవకాశము ఉన్నట్లు కనిపిస్తుంది .

వరి అత్యధికంగా సాగు అయినా జిల్లాలు :

ఇప్పటికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు లో గరిష్టముగా 1 లక్ష హెక్టార్లలో సాగు జరిగితే .. తిరుపతి 65 వేల హెక్టార్లు, వెస్ట్ గోదావరిలో 24 వేల హెక్టార్లు ,ఈస్ట్ గోదావరిలో 19 వేల హెక్టార్లు , బాపట్ల 13 వేల హెక్టార్లు ,ప్రకాశం 11 వేల హెక్టార్లలో ఎప్పటికి నాట్లు గరిష్ట స్థాయిలో సాగు అయ్యాయి .

రబికాలానికి ఉత్తమమైన వారి రకాలు :

స్వర్ణముఖి(యస్ యల్ఆర్-145):
రబి రకం ,పంటకాలం 1౩5 రోజులు. కాండం తొలుచు పురుగు ,ఉల్లికోడు, అగ్గితెగులును తట్టుకుంటుంది .అతి సన్న బియ్యం

వరిలో సమర్ధవంతమైన నారుమడి తయారీ విధానం -యాజమాన్యం & మెళుకువలు...

తెల్లహంస:
అన్నికాలాలకు అనుకూలం,పంటకాలం 125 రోజులు,అగ్గితెగులు,ఎండాకు తెగులు ను తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 2.5 తన్నులు. పెరిగే దశలో చలినికూడా తట్టుకుంటుంది. గింజ పొదవుగా నాణ్యత కలిగి వుంటుంది.తెలంగాణాలో మరియు పరిసర రాష్ట్రాలలో విస్తారం గా పండిస్తున్నారు.

కాటస్ దొర సన్నాలు(యంటియు-1010):
రబీ రకం, ప౦టకాల౦ 120 రోజులు- సుడిదోమ, అగ్గి తెగులు కొ౦త వరకు తట్టుకు౦టు౦ది.దిగుబడి ఎకరాకు 3.2 టన్నులు- గింజ ఐ.అర్.64 వలె సన్న రకం. జి౦కు లోప౦ విజేత వలెరాదు

ప్రభాత్(యంటియు-౩626):
అగ్గి తెగులును తట్టుకుంటుంది. దిగుబడి ఎకరాకు 2.5 టన్నులు. కోస్తాజిల్లాల్లో పండించే ప్రాంతలకు అనువైనది.చేను పడిపోదు. ముతకబియ్యం.

వరి పంటను ఆశించే ప్రధాన తెగుళ్లు .. వాటి నివారణ

Share your comments

Subscribe Magazine

More on News

More