News

ఆంధ్రప్రదేశ్ : 12.5 లక్షల బస్తాలు వరకు వరి ఉత్పత్తి తగ్గవచ్చు !

Srikanth B
Srikanth B
Paddy cultivation
Paddy cultivation

ఖరీఫ్‌లో కోనసీమ ప్రాంతంలో రైతుల బృందం ప్రకటించిన క్రాప్‌ హాలిడే వల్ల దాదాపు 50 వేల ఎకరాల్లో సాగు విస్తీర్ణం, 12.50 లక్షల బస్తాల వరిసాగు తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో 1.20 లక్షల ఎకరాల సాగు భూమి ఉండగా 17 వేల ఎకరాలు చేపలు, రొయ్యల చెరువులుగా మారాయి.

గోదావరి డెల్టాలో ప్రభుత్వం సేకరించిన వరికి చెల్లింపులు ఆలస్యం కావడం, ప్రస్తుతం ఉన్న కాలువల ద్వారా సాగునీరు అందకపోవడం వంటి కారణాలతో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు.

గోదావరి డెల్టాలో ప్రభుత్వం సేకరించిన వరికి చెల్లింపులు ఆలస్యం కావడం, ప్రస్తుతం ఉన్న కాలువల ద్వారా సాగునీరు అందకపోవడం వంటి కారణాలతో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారు. కోనసీమలోని మొత్తం 22 మండలాల్లో 13 మండలాల్లో క్రాప్ హాలిడే ప్రకటించారు. మేజర్ డ్రెయిన్ కూనవరం-వాసలతిప్ప పూడిక తీయకపోవడంతో మైనర్ కాల్వలు పూర్తిగా పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. దీంతో డ్రెయిన్‌ నీరు సముద్రంలోకి వెళ్లదని రైతులు చెబుతున్నారు.

గత ఖరీఫ్ సీజన్‌లో వర్షాకాలంలో పలు మండలాలు నీట మునిగాయి. ఐ పోలవరం మండలంలోని కేసనకుర్రు, తిళ్లకుప్ప, జి ములపాలెం, ఏదురులంక, టి కొత్తపల్లి గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ముమ్మిడివరంలోని ఐనాపురం, గాడిలంక, కొమనపల్లి, కొత్తలంక, తాళ్లరేవు మండలంలోని జి.వేమవరం, నీలపల్లి, పి.మల్లవరంలో వరదనీరు పోటెత్తింది. గత ఖరీఫ్ సీజన్‌లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 

కాగా, కోనసీమలో క్రాప్ హాలిడే అవసరం లేదని జిల్లా వ్యవసాయ అధికారి వై ఆనంద్ కుమారి తెలిపారు. “వరి సేకరణకు సంబంధించిన పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేయబడ్డాయి. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా డ్రైన్ క్లీనింగ్ పనులను పర్యవేక్షిస్తున్నారు. రైతులు లేవనెత్తిన సమస్యలు పరిష్కరిస్తున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

కోనసీమ రైతు పరిరక్షణ సంఘం కార్యదర్శి అయితాబత్తుల ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ కోనసీమ రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఆగస్టు నుంచి డిసెంబరు వరకు సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో డెల్టా ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయి. వేసవిలో చాలా వరకు డ్రెయిన్లు శుద్ధి కాలేదు. మేజర్, మైనర్ కాల్వలన్నీ పిచ్చిమొక్కలతో నిండిపోయాయని తెలిపారు

ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన:చేపల పెంపకానికి ప్రభుత్వం నుంచి భారీగా సబ్సిడీ

Share your comments

Subscribe Magazine