హిమాచల్ ప్రదేశ్‌లోని మండి జిల్లాకు చెందిన నేక్ రామ్ శర్మ అనే రైతు వ్యవసాయానికి, ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయానికి చేసిన విశేష కృషికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన ఏకైక పద్మ అవార్డు గ్రహీత శర్మ, తనకు అవార్డు లభించడం పై ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు .
" సేంద్రీయ వ్యవసాయం ద్వారా , నేను తొమ్మిది రకాల ధాన్యాలు పండిస్తున్నాను, ఈ అవార్డు ఫలితంగా, నా పని పట్ల మరింత బాధ్యతగా భావిస్తున్నాను. నేను సేంద్రీయ వ్యవసాయం ఒక అలవాటుగా వారానికి 14 గంటల వరకు పనిచేశాను, అవార్డు పొందిన తరువాత సేంద్రియ వ్యవసాయం కోసం మరింత కృషి చేస్తాన్నని వెల్లడించారు .
నెక్ రామ్ మాట్లాడుతూ వ్యవసాయంలో ఎరువుల వాడకాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించాలని, పాఠశాలల నుంచే సేంద్రియ వ్యవసాయం గురించి పిల్లలు నేర్చుకునేలా చేయాలని, ప్రభుత్వం వీటిని పొందుపరిచే మార్గాలను అన్వేషించాలని సూచించారు.
మేము తెగులు నియంత్రణ కోసం ప్రత్యేకమైన మిశ్రమాన్ని అభివృద్ధి చేసాము. ‘‘కొత్త విధానం వల్ల నా దానిమ్మ పొలం ఇప్పుడు చీడపీడల బెడద లేకుండా ఉంది.
రూ.కోట్లు పలుకుతున్న దున్నపోతు..అంత స్పెషల్ ఏంటి ?
UNGAలో 2023ని " ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్" గా పేర్కొంటూ ఒక తీర్మానానికి భారత ప్రభుత్వం నాయకత్వం వహించింది మరియు దీనికి 72 దేశాల మద్దతు లభించింది.
"ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్ 2023" ప్రకటించడాన్ని శర్మ ప్రశంసించారు, అంతర్జాతీయ మిల్లెట్ సంవత్సరంగా ప్రకటించబడిన తరువాత, ప్రజలు మరింత అవగాహన పెంచుకున్నారు. గతంలో అడవి నుంచి నేరుగా ఆహారం తీసుకునేటప్పుడు రోగాలు వచ్చేవి అని . ఈ రోజుల్లో డబ్బు సంపాదన కోసం ప్రజలు అనైతిక ప్రవర్తనకు పాల్పడుతున్నారని, దీంతో వ్యవసాయ ఉత్పత్తులకు అనేక రోగాలు వస్తున్నాయన్నారు.
Share your comments