News

ప్రతియేటా లక్షల్లో రైతు ప్రాణాలను తీస్తున్న.. పురుగుమందులు.. ఎలాగంటే?

KJ Staff
KJ Staff

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించడానికి విచ్చలవిడిగా రసాయన మందులు పిచికారీ చేయడం వలన కాలక్రమేణా నీరు, గాలి, నేల చివరకు మనం ఆహారంగా తీసుకునే మొక్కలు, వివిధ రకాల పళ్ళు కూరగాయలు వంటివి ప్రమాదకర రసాయన కారకాలతో నిండిపోతున్నాయి. ముఖ్యంగా పురుగుమందులు, పెయింట్స్ ద్వారా ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం జరిగి మనుషుల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయని ఇప్పటికే చాలామంది శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు

కొన్ని అధ్యయనాల ప్రకారం పెయింట్స్ మరియు పురుగుమందుల ఏరోసోల్స్ ప్రమాదకర స్థాయిలో గాలిలోకి చేరి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 9 లక్షల మంది మరణానికి కారణం అవుతున్నాయి.ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వీటిపై ప్రజలకు అవగాహన లేదు. అలాగే నియంత్రణ సంస్థలు వీటిని పెద్దగా పట్టించుకోలేదు. దీంతో రైతులు ఇప్పటికీ పురుగుమందులు తమ పంట పొలాలపై వెదజల్లుతున్నపుడు తగిన జాగ్రత్తలు
పాటించరు.దీని వల్ల వారి ఆరోగ్యంపై ప్రభావం చూపడమే కాకుండా ఏరోసోల్స్ గాలికి చేరుకుని
ప్రకృతి వినాశనానికి కారణం అవుతున్నాయి.

పెయింట్స్,పురుగుమందుల ఏరోసోల్స్ చాలా ప్రమాదకారులని వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉందని గతంలో జరిపిన పరిశోధన ప్రకారం కాలుష్య కణ పదార్థం (పిఎమ్ 2.5) ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 3 మిలియన్ల మరణాలకు కారణమవుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే చాలా దేశాలు ప్రమాదకర వాయు కాలుష్యానికి కారణమైన వాటిపై నియంత్రణ చేపట్టి ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.

Share your comments

Subscribe Magazine