రైతులను మోసం చేసేవారికి కొదవ లేదు మార్కెట్లో పంట విక్రయించే దగ్గరినుంచి రైతులు పంట కోసం ఉపయోగించే విత్తనాల వరకు అందరు రైతులను మోసగించడానికి ప్రయత్నించే వారే , రైతులు మంచి విత్తనాలు ఉపయోగించేటప్పుడే మంచి దిగుబడి పొందే అవకాశం ఉన్నది అయితే మార్కెట్లో కొందరు దళారులు వారి లాభార్జయే ద్యేయంగా రైతులకు నకిలీ వితనాలను విక్రయించి రైతుల వెన్ను విరుస్తున్నారు కొందరు దళారులు అయితే నకిలీ విత్తనాలపై ప్రభుత్వం దృష్టిసారించింది.
నకిలీ విత్తనాలు విక్రయించే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు.
నకిలీ విత్తనాలను నివారించడానికి గ్రామస్థాయి నుంచి నిఘా ఏర్పాట్లు చేసినట్లు తెలిపిన ఆయన.. ఇప్పటి వరకు వీటిని విక్రయించే 58మందిపై పీడీ చట్టం నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
గిట్టుబాటు ధర రాక పంటను అమ్ముకోలేని దుస్థితిలో మిర్చి రైతులు ..
మంచి విత్తనాలు వినియోగిస్తే అధిక లాభం పొందవచ్చిని భావించే రైతుల కలలను నకిలీ విత్తనాలు ఏటా కడగండ్ల పాలు చేస్తున్నాయి. విత్తన కంపెనీల మోసాలు, నాసిరకం విత్తన కష్టాలతో రైతన్న పొలంలో చల్లుతున్న విత్తనాలు బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. అందుకనే రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల విక్రయాలు అరికట్టడానికి ప్రత్యేక దృష్టిసారించింది. దీనిపై స్పందించిన డీజీపీ గత 8 ఏళ్లగా నకిలీ విత్తన విక్రయదారులపై ఉక్కుపాదం మోపుతున్నామని పేర్కొన్న ఆయన.. పోలీస్ శాఖ తరపున 991 కేసులు నమోదు చేసి 1932మందిని అరెస్ట్ చేశామని వెల్లడించారు.
Share your comments