తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్, లైవ్ స్టాక్ మిషన్ ని అనుసరిస్తూ రైతుల అభివృద్ధి కోసం విరివిగా పని చేస్తుంది. దాని లో భాగం గా రెండవ విడత గొర్రెల పంపిణీపై సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో పశు సంవర్ధక శాఖ, నోయోజక వర్గ స్పెషల్ ఆఫీసర్ల తో సమావేశం నిర్వహించారు.
కలెక్టర్ శరత్ మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గొర్రెల కొనుగోలు కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయడం తో పాటు ప్రతి గొర్రెకు జియో ట్యా గింగ్ మరియు భీమా చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గొర్రెల రవాణాకు "ఈ టెండర్ " ప్రక్రియ ను పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు . పంపిణిలో ఎటువంటి లోటు పాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు .రెండవ విడత లబ్ది దారుల జాబితా పరిశీలించి, వారిలో ఎవరైనా మరణించి ఉంటె నామినీ వివరాలు సేకరించాలని ఆదేశించారు.
ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వం గొర్రెల యొక్క యూనిట్ వ్యయాన్ని రూ . 1. 25 లక్షల నుంచి 1. 75 లక్షలకు పెంచిందని, వీటిలో 25 శాతం ( రూ . 43,750) లబ్దిదారుడి వాటా, మిగతాది ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తుందన్నారు. ఇందులో లబ్ధిదారూడి వాటా సేకరణ కోసం మండల స్థాయిలో గొల్ల ,కుర్మ సంఘాల ఆద్వర్యంలో మీటింగులు పెట్టి అవగాహన కల్పించాలని సూచించారు . నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యే ఆధ్వర్యం లో సమావేశాలు నిర్వహించి గొల్ల, కుర్మ వర్గాల వారికి అవగాహనా కల్పించాలి అన్నారు .
ఇది కూడా చదవండి .
ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభం..ఇంతలో వారిపై మరో పిడుగు
ఈ పథకం మొదటి విడత జూన్ 20, 2017 లో ప్రారంభమై, సుమారు 3,665,000 గొర్రెలను పంపిణి చేయడం జరిగింది .ఈ పథకానికి రిజిస్టర్ చేసుకోడానికి లబ్ధిదారుడు తెలంగాణ స్థానికుడు అయ్యుండాలి . కుర్మా లేదా యాదవ వర్గానికి చెంది ఉండి , 18 సంవత్సరాలకు పైబడి ఉండాలి.
ఇది కూడా చదవండి .
Share your comments