News

ఏపీలో పింఛన్ల పంపిణీ ప్రారంభం..ఇంతలో వారిపై మరో పిడుగు

Gokavarapu siva
Gokavarapu siva

ఆంధ్రప్రదేశ్ పించదారులకు శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో నిన్నటినుండి వృద్దులకు పింఛన్ల పంపిణీ ప్రారంభమయ్యింది. సాధారణంగా 1వ తేదీ నుండి ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు జరగాలి, కానీ ఆరోజు బ్యానుకలకు సెలవు కావడంతో సోమనారం నుండి ఈ పనులను ప్రభుత్వం చెప్పటింది. ఇది శుభవార్త అనుకునే లోపు ప్రభుత్వం వారిపై మరో పిడుగులాంటి వార్తను వదిలింది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

అధికారులు నిన్న అనగా సోమవారం మధ్యాహ్నం బ్యాంకుల నుండి నగదును తీసి సచివాలయాలకు అందజేశారు. నిన్నటి నుండి వాలంటీర్లు తమ పరిధిలో ఉన్న వృద్దులకు అందజేయడం ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటికే 51,445 మందికి పింఛన్లను వాలంటీర్లు పంపిణి చేశారు. దీనితోపాటు రాష్ట్రంలో పింఛన్ల పంపిణీలో రాష్ట్రంలో జిల్లా మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో పింఛన్ల పంపిణి జరుగుతున్నాయని వృద్దులు సంతోషించే లోపే వారిపై ప్రభుత్వం పెద్ద పిడుగు వేసింది.

ప్రభుత్వం ఇన్నాళ్లు రాష్ట్రంలో పింఛన్ల పంపిణీకి అందుబాటులో ఉన్న పోర్టబులిటీ విధానాన్ని ఎత్తివేసింది. పింఛనుదారులు కచ్చితంగా ఏ నెలకు ఆ నెలలోనే పింఛను తీసుకోవాలని కొత్త నిబంధనను అమలు చేస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను కూడా జారీ చేసింది. ఇకనుండి పింఛన్లను ఇంటికి తెచ్చి ఇవ్వాలంటే వారి యొక్క నివాస స్థం అనేది సచివాలయ ప్రాంతం నుండి 15 కిలోమీటర్ల లోపు ఉండాలని ప్రభుత్వం తెలియజేసింది.

ఇది కూడా చదవండి..

సన్నాలకు మద్దతు ధర మించి రూ.400 అదనం..

దీనికొరకు ప్రభుత్వం రాష్ట్రంలో జియో ఫెన్సింగ్‌ విధానాన్ని అమలు చేస్తుంది. ఈ సౌకర్యాలు తొలగించడంతో ఇప్పటికే లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఈ జియో ఫెన్సింగ్‌ విధానం వారిని మరిన్ని ఇక్కట్లకు గురిచేయనుందని అందరు అంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 63.42 లక్షల మందికి పింఛన్లను అందిస్తుంది. కానీ కొంతమంది వృద్దులు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవే కాకుండా దూర ప్రాంతాల్లోని పిల్లల దగ్గర కొంతమంది వృద్ధులు ఉంటున్నారు. ఇలాంటి వారికి ఇదివరకున వాలంటీర్లు వెళ్లి పింఛన్లు అందజేసేవారు. ఇప్పుడు ప్రభుత్వం అమలు చేస్తున్న జియో ఫెన్సింగ్‌ విధానంతో ఈ సౌకర్యాలు ఇక ఉండవు. అప్పటికప్పుడు అధికారులు ఈ ఆదేశాలను అధికారులు అమల్లోకి తెచ్చారు, దీనితో పింఛనుదారులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కూడా చదవండి..

సన్నాలకు మద్దతు ధర మించి రూ.400 అదనం..

ఇకనుండి 15 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంటే పింఛను మొత్తాన్ని అందించే అవకాశం వాలంటీరుకు ఉండదు. అలాంటి వారికి పింఛను ఇవ్వాల్సి వస్తే జిల్లా డీఆర్‌డీఏ అధికారులను సంప్రదించాలని గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఇది కూడా చదవండి..

సన్నాలకు మద్దతు ధర మించి రూ.400 అదనం..

Related Topics

andhara pradesh pension

Share your comments

Subscribe Magazine