సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (SUP)ని దశలవారీగా తొలగించాలని రాష్ట్రాలకు కేంద్రం లేఖలు.
జూన్ 5 , 2022 - ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా దేశవ్యాప్తంగా రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు పట్టణ స్థానిక సంస్థలు దేశాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ (SUP) రహితంగా మార్చడానికి, అలాగే పర్యావరణాన్ని మెరుగుపరచడంలో దోహదపడేలా పౌరులంతా కలిసి చెట్ల పెంపకంతో పాటు మరిన్ని ప్రయత్నాలు చేయాలని మన్ కీ బాత్ లో ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.
గృహనిర్మాణ & పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ( MoHUA ) ఈ ఆదేశాలను నెరవేర్చడానికి అనేక రకాల కార్యకలాపాలను చేపట్టాలని రాష్ట్రాలు మరియు UTలకు ఉత్తర్వులను జారీ చేసింది. వీటిలో పెద్ద ఎత్తున క్లీనింగ్ మరియు ప్లగింగ్ డ్రైవ్‌లు ఉంటాయి, ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణకి మరియు చెట్ల పెంపకానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక బృందాలు, స్థానిక NGOలు/CSOలు, NSS మరియు NCC క్యాడెట్‌లు, RWAలు, మార్కెట్ అసోసియేషన్‌లు, కార్పొరేట్ సంస్థలు మొదలైనవి ఇందులో భాగం కానున్నాయి.
సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మరియు MoEF&CC ఆదేశాల మేరకు 2,591 ULBలు (4,704లో) నోటిఫికేషన్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని ఇప్పటికే నివేదించగా, మిగిలిన 2,100-ప్లస్ ULBలు జూన్ 30, 2022లోగా నోటిఫై చేసేలా రాష్ట్రాలు/UTలు నిర్ధారించనున్నాయి.
PWM (సవరించబడిన) రూల్స్, 2021 ప్రకారం, డెబ్బై-ఐదు మైక్రాన్ల (75 µ అంటే 0.075 మిమీ మందం) కంటే తక్కువ లేదా రీసైకిల్ చేసిన ప్లాస్టిక్‌తో తయారు చేసిన క్యారీ బ్యాగ్‌ల తయారీ, పంపిణీ , అమ్మకం మరియు వినియోగం నిషేధించబడింది. పర్యవసానంగా, వీధి వ్యాపారులు, స్థానిక దుకాణదారులు అందించే సన్నని ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్‌లను ఉపయోగించకుండ ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే విధంగా ప్రోత్సహించనున్నారు.
అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడానికి సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టనున్నారు.
మరిన్ని చదవండి.
ఖరీఫ్ పంటలకు అందుతున్న కనీస మద్దతు ధర పూర్తి వివరాలు!
వాయు కాలుష్యం తగ్గితే పంట దిగుబడి 28% వరకు పెరుగుతుంది!
Share your comments