News

వడగళ్ళ వాన సమయంలో రైతులు పాటించాల్సిన జాగ్రత్తలు పై PJTSAU సూచనలు జారీ !

Srikanth B
Srikanth B

అకాల వర్షాలు రైతులను ఎంతగానో నష్ట పరుస్తున్నాయి , రెండు తెలుగు రాష్ట్రాలలో గత రెండు రోజుల నుంచి వడగళ్ళ వానలు కురుస్తున్నాయి మరియు వాతావరణ శాఖ సూచనల మేరకు రానున్న 2 రోజులపాటు వర్షాలు పిడుగు , వడగళ్ళ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇదే క్రమంలో వడగళ్ళ వాన సమయంలో రైతులు పాడించాల్సిన జాగ్రత్తలు పై PJTASU సూచనలు జారీ చేసింది .

వడగళ్ళ వాన సమయంలో రైతులు పాడించాల్సిన జాగ్రత్తలు:

ముందస్తు వడగళ్ళ వాన సూచనలకు రైతులు పాటించ వలసిన యాజమాన్య పద్ధతులు రాష్ట్రంలో అక్కడక్కడ వివిధ జిల్లాలలో వడగళ్ళ వర్షాలు కురిసే సూచనలున్నందున రైతులు చెట్ల క్రింద నిలబడరాదు మరియు పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల క్రింద ఉంచరాదు.

భారీ వర్షాలు కురిసే సూచనలున్నందున అధిక వర్షపు నీరు బయటికి పోవడానికి ఆరుతడి మరియు కూరగాయ పండించే పొలంలో మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలి.

భారీ వర్షాలు కురిసే సూచనలున్నందున కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించవలెను. మార్కెట్ కు తరలించిన దాన్యం తడవకుండా టార్పాలిస్ తో కప్పి వుంచవలెను.

కోతకు సిద్ధంగా ఉన్న కూరగాయ పంటలను కోసుకోవాలి.

ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో డ్రోన్ పైలెట్ లైసెన్సు కోర్సు.. దరఖాస్తు చేసుకోండి ఇలా !

చీడపీడలు, తెగుళ్ళు ఉదృతి అధికంగా కాకుండా ఉండుటకు సరైన సమయంలో నివారణ చర్యలు చేపట్టాలి.

వడగళ్ళ వర్ష సూచనలున్నందున పశువులు, మేకలు మరియు గొర్రెలను సురక్షిత ప్రాంతంలో ఉంచవలెను.
వడగళ్ళ వాన పడిన ప్రాంతపు రైతులు పాటించ వలసిన యాజమాన్య పద్ధతులు
భారీ వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలం నుండి నీటిని బయటకు తీసివేయాలి.

నేల ద్వారా వ్యాపించే తెగుళ్ళను నివారించుటకు నేల బాగా తడిచే విధంగా 3 గ్రా. కాపర్ ఆక్సీ క్లోరైడ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

అధిక వర్షాలు కురిసిన ప్రాంతాలలో పొలంనుండి నీటిని తీసివేసిన తరువాత పంట త్వరగా కోలుకోనుటకు 2% యూరియా లేదా 1% పొటాషియం నైట్రేట్ ద్రావణంను పంటపై పిచికారి
చేయాలి.

వర్షాలు తగ్గిన తరువాత పైపాటుగా ఎకరాకు 20 కిలోల యూరియా వేసుకోవాలి.
అధిక వర్షాల వలన శాకీయ దశలో ఉన్న కూరగాయ పంటలలో నష్టం ఎకువగా సంభవించినట్లయితే తిరిగి మొక్కలను నాటుకోవాలి.

ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీలో డ్రోన్ పైలెట్ లైసెన్సు కోర్సు.. దరఖాస్తు చేసుకోండి ఇలా !

Related Topics

Heavy Rain Alert

Share your comments

Subscribe Magazine

More on News

More