మనం ప్రతి రోజు వార్తలను తెలుసుకోవడానికి పత్రికలను కొంటూ ఉంటాం. అలా కొన్న ఆ పత్రికలను చదివిన తరువాత ఇంట్లో వివిధ అవసరాలకు వాడుకుంటాం లేదా నెల మొత్తం పత్రికలను కేజీ లెక్కన వ్యాపారస్థుకాలు అమ్మేస్తూ ఉంటాం. కానీ చైనా చెందిన 'మైనిచి షింబున్షా' అనే సంస్థ ప్రయోగాత్మకంగా వార్తాపత్రిక చదివిన తరువాత మట్టిలో కప్పెడితే, వాటి నుండి పరిమళాలు అందించే పూల మొక్కలు, ఔషధ మొక్కలు పత్రికల నుండి మొలకెత్తుతాయి.
పర్యావరణం పట్ల ప్రజలకు అవగాహన కలగడానికి చేసే ప్రయత్నంలో ఈ ప్రయోగాన్ని చేశామని మైనిచి షింబున్షా సంస్థ చెబుతుంది. పత్రిక చదవడం పూర్తయిన తర్వాత, పత్రికను చిన్న చిన్న ముక్కలుగా చేసి వాటిని మట్టిలో నాటాలి. ఆలా నాటిన తరువాత మొక్కల మాదిరిగానే వీటికి నీరు పెట్టాలి. ఆలా చేయడం వలన మొక్కలు మొలుస్తాయి. పత్రికల నుండి మొక్కలు మొలకెతే విధానాన్ని డెంట్సు ఇంక్ అనే జపాన్ కు చెందిన అతి పెద్ద అడ్వర్టైజింగ్ ఏజెన్సీ సంస్థ కనిపెట్టింది. తరువాత ఈ సంస్థ మైనిచి షింబున్షా కంపెనీతో కలిసి పత్రిక ప్రచురణ ప్రారంభించింది. మైనిచి షింబున్షా కంపెనీ కొన్ని సంవత్సరాలుగా పర్యావరణ సమస్యల గురించి జపాన్ లోని అనేక పాఠశాలల్లో అవగాహన కల్పించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 95 మిలియన్ చెట్లను వార్తా పత్రిక తయారీ కోసం నరికివేస్తున్నట్లు అమెరికాకు చెందిన 'వన్ ఎర్త్' ఎన్జిఓ సంస్థ తెలిపింది. అయితే ఈ కంపెనీ అందుబాటులోకి తెచ్చిన గ్రీన్ న్యూస్పేపెర్ కు వచ్చిన ఆదరణ చూస్తుంటే ఈ కాలంలో కూడా పత్రికలను రిడ్సర్స్ ఆదరిస్తారని నిరూపించింది.
ఇది కూడా చదవండి..
తెలంగాణాలో రికార్డు స్థాయిలో సాగు...
మే 4, 2016న గ్రీనరీ డే కోసమని 'మైనిచి షింబున్షా' కంపెనీ తొలిసారిగా ఈ పత్రికను ప్రచురించింది. 100 శాతం బయోడిగ్రేడబుల్ ప్రచురించిన తోలి పత్రికగా ఈ సంస్థ గుర్తింపు తెచ్చుకుంది. పాత కాగితాలను రీసైకిల్ చేసి, దానికి వివిధ రకాల మొక్కల విత్తనాలను జతచేసి తయారు చేసిన కాగితాన్ని ముద్రణ కోసం వినియోగిస్తున్నారు. పత్రికలపై వార్తలను ప్రచురణచడానికి ఇంకులను వాడకుండా సహజసిద్ధంగా మొక్కలనుండి సిరాను సేకరించి ముద్రణకు వాడతారు.
అమెరికాలోని కొన్ని కంపెనీలు ఈ ప్లాంటేషన్ పేపర్ తయారు చేయడం ప్రారంభించారు. జపాన్ తరహా లోనే మన భారతదేశంలో కూడా ఇటువంటి పత్రిక ముద్రలను మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఐతే శుభలేఖల తయారీకి ఎక్కువగా వాడుతున్నారట.
ఇది కూడా చదవండి..
Share your comments