News

తెలంగాణాలో రికార్డు స్థాయిలో సాగు...

Gokavarapu siva
Gokavarapu siva

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా పంట సాగు రికార్డులు సృష్టిస్తుంది. ప్రభుత్వ సహకారంతో ఇక్కడ రైతులు సాగు విస్తీర్ణం చేసారు. పంటలకు కావలసిన నీటిని అందించడానికి ప్రభత్వం సాగునీటి ప్రాజెక్టులను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనితో భూగర్భ జలాలు పెరిగి నీటి కొరత తెలంగాణ రాష్ట్రంలో లేకున్నా చేసింది. యాసంగి వరి సాగులోను మరియు అన్ని పంటల సాగులోను కొత్త రికార్డులను సృష్టించింది.

యాసంగిలో ఇంతకుముందు సీజన్కు సంబంధించి అత్యధికంగా 2020-21లో 68.17 లక్షల ఎకరాల్లో పంటలు వేయగా...ఈసారి యాసంగిలో 68.53 లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయని బుధవారం విడుదల చేసిన నివేదికలో వ్యవసాయశాఖ వెల్లడించింది. 2014-15 యాసంగిలో 28.18 లక్షల ఎకరాల్లోనే పంటలు పండించగా.. మరో 40.35 లక్షల ఎకరాల సాగు పెరగడం గమనించాల్సిన విషయం.

ఇంత ఎక్కువ స్థాయిలో పంటలు పండించడానికి వానాకాలంలో పడిన వర్షాలకు చెరువులు నిడటం అని చెబుతున్నారు. దానితో పాటు రైతులకు ప్రభత్వం 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇవ్వడం మరియు 30 లక్షల వ్యవసాయ బోర్లను రైతులకు అందించడం వలనే ఇది సాధ్యమైందని చెబుతున్నారు. వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టులు కూడా రైతులకు నీటి సమస్యను తప్పించాయి. రైతులు కూడా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రభుత్వం సూచించిన పంటలను వేసి అధిక లాభాలను రైతులు పొందారు.

ఇది కూడా చదవండి..

పెరుగుతున్న పురుగుమందు వాడకం .. అనర్ధం తప్పదా ?

మొత్తం పంటలతో పాటు యాసంగిలో వరి సాగు కూడా రికార్డులు సృష్టించింది. యాసంగిలో 2014-15 సంవత్సరాల్లో 12.23 లక్షల ఎకరాల్లో వరిసాగు కాగా.. ప్రస్తుతం ఏకంగా 53.08 లక్షల ఎకరాలకు పెరిగింది. అంటే గత తొమ్మిదేళ్లలో యాసంగిలో వరిసాగు 40.85 లక్షల ఎకరాలు పెరిగింది. 2015 - 16 యాసంగిలో కేవలం 7.35 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగు జరిగింది. క్రమంగా సాగు పెరుగుతులు వచ్చింది. ఇక్కడ వరినాట్లు వేయడానికి ఇంకా పది రోజుల సమయం ఉన్నందున వరి యొక్క విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఈ విధంగా యాసంగిలో వరిసాగు రికార్డులను సృష్టించింది.

ఇది కూడా చదవండి..

పెరుగుతున్న పురుగుమందు వాడకం .. అనర్ధం తప్పదా ?

Related Topics

yaasangi Rice cultivation

Share your comments

Subscribe Magazine