News

ప్రధానమంత్రి కిసాన్ యోజన లబ్ధిదారులకు శుభవార్త, హోలీ కి ముందే 11వ విడత రూ. 2000 విడుదల..

S Vinay
S Vinay

పీఎం కిసాన్ యోజన లబ్ధిదారులకు శుభవార్త. ప్రభుత్వం ఈ పథకం కింద తదుపరి వాయిదాను హోలీకి ముందు లేదా రోజున విడుదల చేయవచ్చు. అయితే దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.కానీ ప్రభుత్వం డబ్బును విడుదల చేసే ముందు, లబ్ధిదారులందరూ తమ eKYCని పూర్తి చేసి, వారి వివరాలనునమోదు చేసుకోవాలి. అలా చేయని వారికి సకాలంలో డబ్బులు అందకపోవచ్చు

అందుతున్న సమాచారం మేరకు PM కిసాన్ యొక్క లబ్ధిదారులందరూ వీలైనంత త్వరగా eKYCని పూర్తి చేయాలి తద్వారా తదుపరి విడత రూ. 2000 వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయవచ్చు.

eKYC పూర్తి కాకపోతే, ప్రభుత్వం డబ్బులు . పంపకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వం లబ్ధిదారులందరికీ eKYCని తప్పనిసరి చేసింది, అయితే కొన్ని కారణాల వల్ల పనులు నిలిపివేయబడ్డాయి. అయితే ఇప్పుడు eKYC లింక్ ని అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది , తద్వారా రైతులు తమ వివరాలను అందులో నమోదు చేసుకొని eKYC ని పూర్తి చేయవచ్చు.

PM కిసాన్ కోసం eKYC ఎందుకు చేసుకోవాలి:

  • గత సంవత్సరం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద నమోదు చేసుకున్న రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం eKYCని తప్పనిసరి చేసింది.

  • నిధులు దారి మళ్లకుండా సరైన రైతులకి చేర్చడమేదీని ముఖ్య ఉద్దేశ్యం

  • మోసాలు, కుంభకోణాలు జరగకుండా అనర్హులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందకుండా నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే లబ్ది పొందుతున్న రైతులు మరియు కొత్త రైతులు తమ eKYCని ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేసుకోవాలి .

PM కిసాన్ యోజన: eKYC ఎలా పూర్తి చేయాలి


  • మన ఇంటి దగ్గర నుండే ఈ ప్రక్రియని పూర్తి చేయవచ్చు PM కిసాన్ మొబైల్ యాప్ లేదా ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్ సహాయంతో ఆన్‌లైన్‌లో ఈ పనిని పూర్తి చేయవచ్చు. మీ eKYCని ఆన్‌లైన్‌లో పూర్తి చేయడానికి క్రింద ఇవ్వబడిన సూచలను అనుసరించండి;
  • PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • కుడి వైపున రైతుల విభాగం లో eKYC ఉంటుంది . దాన్ని క్లిక్ చేయండి
  • దీని తర్వాత మీ ఆధార్‌ను నమోదు చేసి, సెర్చ్ బటన్‌పై క్లిక్ చేయండి.
  • అవసరమైన వివరాలను నమోదు చేయండి
    ప్రతిదీ సరిగ్గా జరిగితే, eKYC పూర్తవుతుంది లేదా అది చెల్లనిదిగా చూపబడుతుంది. ఈ సందర్భంలో, మీరు సమీపంలోని ఆధార్ సేవా కేంద్రాన్ని సంప్రదించాలి

ఇంకా చదవండి

పంట వ్యర్థాలను దహించకుండా ఫలవంతగా వాడుకుందాం ఇలా

మామిడి పిందెలు రాలకుండా నిర్మూలన చర్యలు

Related Topics

pm kisan yojana eKYC

Share your comments

Subscribe Magazine

More on News

More