News

PM Kisan 11th Installment:నేడే రైతులకి పీఎం కిసాన్ 11వ విడత (21,000 కోట్లు) విడుదల!

S Vinay
S Vinay

PM Kisan 11th Installment:పీఎం కిసాన్ 11వ విడతని ప్రభుత్వం నేడు 10 కోట్ల మంది రైతులకు గాను 21,000 కోట్లు విడుదల చేయనుంది.

PM Kisan 11th Installment: 21,000 కోట్ల విలువైన ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 11వ విడతను ప్రధాని మోదీ నేడు (మంగళవారం) విడుదల చేస్తారని వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది .కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర తోమర్ న్యూఢిల్లీలోని పూసా కాంప్లెక్స్ నుండి కార్యక్రమంలో పాల్గొంటారు.

పీఎం-కిసాన్ పథకం అర్హులైన రైతులకు సంవత్సరానికి రూ.6,000. ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది.మూడు సమాన చెల్లింపుల్లో ఒక్కొక్కరికి రూ.2,000 డబ్బు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయబడుతుంది. జనవరి 1న ప్రధాని నరేంద్ర మోదీ 10వ విడతకుగాను 10 కోట్ల మందికి పైగా రైతులకు 20,000 కోట్లు చెల్లించగా 11 వ విడతకి 21,000 కోట్లని కేటాయించారు.

వివిధ కేంద్ర పథకాలు రైతుల జీవన శైలిని ఎలా ప్రభావితం చేస్తున్నాయో ప్రధాని నరేంద్ర మోదీ,దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల రైతులతో సంబాషించనున్నారు. అయితే ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఏకైక కార్యక్రమం అని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది.

కేంద్ర ప్రభుత్వ పథకాలు:– ప్రధానమంత్రి కిసాన్ యోజన, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన , ప్రధాన మంత్రి మాతృ వందన యోజన, పోషణ్ అభియాన్, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ & పట్టణ), జల్ జీవన్ మిషన్ & అమృత్, ప్రధానమంత్రి స్వానిధి యోజన , ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్, ఒక దేశం-ఒక రేషన్ కార్డ్, PM జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్, ఆయుష్మాన్ భారత్ హెల్త్ & వెల్నెస్ సెంటర్లు, PM ముద్రా యోజన ఉన్నాయి.

మరిన్ని చదవండి.

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు 10 లక్షల సహాయం!

Share your comments

Subscribe Magazine