News

రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు.. రైతుల అకౌంట్లోకి రూ.2 వేలు..

KJ Staff
KJ Staff
pm kisan
pm kisan

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 9వ విడత నగదు జమ చేయడానికి ముహూర్తం ఫిక్స్ అయింది. సోమవారం(9వ తేదీ) మధ్యాహ్నం 12.30 గంటలకు పీఎం కిసాన్ లబ్ధిదారుల అకౌంట్లో ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా కంప్యూటర్ బటన్ నొక్కి డబ్బులు జమ చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో మోదీ ముచ్చటించనున్నారు. 9వ విడతగా 9.75 కోట్ల రైతుల ఖాతాల్లో రూ.19,500 కోట్లు బదిలీ చేయనున్నారు.

8వ విడత డబ్బులను మే నెల 14వ తేదీన ప్రధాని మోదీ విడుదల చేశారు. రెండు నెలలు పూర్తైన తర్వాత వెంటనే 9వ విడత నగదును కేంద్రం జమ చేస్తోంది.10వ విడత డబ్బులను డిసెంబర్ లో జమ చేసే అవకాశముంది. పీఎం కిసాన్ పథకం క్రింద ప్రతి ఏడాది రూ.6 వేలను కేంద్రం ప్రభుత్వం మూడు విడతలుగా నేరుగా రైతుల అకౌంట్లో జమ చేస్తోంది. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున జమ చేస్తోంది.

పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో పేరు ఉందో.. లేదో చూసుకోండిలా..

-పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ https://pmkisan.gov.in/కు వెళ్లండి
-కుడివైపున కనిపించే ఫార్మర్స్ కార్నర్ అనే బటన్ మీద క్లిక్ చేయండి
-ఆ తర్వాత లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయండి
-అక్కడ రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, బ్లాక్, విలేజ్ వివరాలను నమోదు చేసి గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయండి
-అప్పుడు ఒక జాబితా వస్తుంది. అందులో మీ పేరు ఉందో.. లేదో చూసుకోండి

డబ్బులు పడ్డాయో.. లేదో తెలుసుకోండిలా..

-pmkisan.gov.inకు వెళ్లండి
-పేమంట్ స్టేటస్ మీద క్లిక్ చేయండి
-ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ లేదా అకౌంట్ నెంబర్ నమోదు చేయండి
-ఆ తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి
-అప్పుడు మీకు డబ్బులు పడ్డాయో.. లేదో తెలుస్తుంది.

Share your comments

Subscribe Magazine