News

ఈ నెల 10లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు

KJ Staff
KJ Staff

రైతులకు త్వరలో శుభవార్త అందనుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు త్వరలో రైతుల బ్యాంకు ఖాతాల్లో పడనున్నాయి. ఈ నెల 10లోగా రూ. 2 వేలను కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు అకౌంట్లలో జమ చేయనుంది. ఇప్పటివరకు 7 విడతల డబ్బులను జమ చేయగా.. 8వ విడత డబ్బులను త్వరలో జమ చేయనుంది.

పీఎం కిసాన్ సమ్మన్ నిధి పథకం కింద ప్రతి సంవత్సరం రూ.6 వేలను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా ఈ డబ్బులను జమ చేస్తోంది. మొదటి విడత డబ్బులను ఏప్రిల్ 1 నుండి జూలై 31 మధ్య, రెండవ విడత డబ్బులను ఆగస్టు 1 నుండి నవంబర్ 30 మధ్య, మూడవ విడత నగదును డిసెంబర్ 1 నుండి మార్చి 31 మధ్య ఇస్తుంది. అయితే కొంతమంది అర్హత లేని వ్యక్తులు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనర్హులను గుర్తించి లబ్ధిదారుల జాబితా నుంచి తొలగిస్తుంది.

చిన్న, అట్టడుగు రైతులను దృష్టిలో పెట్టుకుని ప్రధాని కిసాన్ సమ్మన్ నిధి పథకాన్ని 2019 ఫిబ్రవరిలో మోడీ ప్రభుత్వం ప్రారంభించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత డబ్బులు గత నెలలోనే రైతులకు అందించాల్సి ఉంది. కానీ ఐదు రాష్ట్రాల ఎన్నికల నిర్వహణలో అధికార యంత్రాంగం బిజీగా ఉండటం వల్ల నగదు జమ చేయలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగియడంతో.. మే 10లోగా పీఎం కిసాన్ డబ్బులను కేంద్రం జమ చేయనుంది.

మీకు డబ్బులు పడతాయో?... లేదో? తెలుసుకోవడం ఎలా?

-https://pmksan.gov.in/ వెబ్ సైట్‌ని సందర్శించండి.
-ఆ తర్వాత ఫార్మర్స్ కార్నర్ బటన్ మీద క్లిక్ చేయాలి.
-ఆ తర్వాత బెనిఫీసియరీ బటన్ మీద క్లిక్ చేయాలి.
-అక్కడ మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్ గ్రామాన్ని ఎన్నుకోవాలి.
-ఆ తర్వాత గెట్ రిపోర్ట్ పై క్లిక్ చేయాలి. అప్పుడు లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. అందులో మీ పేరు ఉందో లేదో చూసుకోవాలి
అందులో మీ పేరు ఉంటే మీకు పీఎం కిసాన్ డబ్బులు వస్తాయి.

Share your comments

Subscribe Magazine