రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేలు ప్రభుత్వం అందిస్తున్న విషయం తెలిసిందే. మూడు విడతలుగా ఈ డబ్బులను లబ్ధిదారులైన రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేస్తోంది. నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేలు ఇస్తోంది. రైతులకు పెట్టుబడి సాయం ఇవి అందిస్తోంది.
అయితే రైతులకు ఈ డబ్బులు సరిపోవడం లేదు. మరింతగా సాయం చేయాలని డిమాండ్లు వస్తున్నాయి. దీంతో పెట్టుబడి సాయాన్ని రూ.10 వేలకు పెంచే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు గతంలో జోరుగా వార్తలొచ్చాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ఆ వార్తలను ఖండించింది. ప్రస్తుతానికి పెంచే ఆలోచన లేదని కేంద్రమంత్రులు స్వయంగా పార్లమెంట్ లో వెల్లడించారు. దీంతో కేంద్రానికి ఇప్పట్లో పెంచే ఆలోచన లేదని తెలుస్తోంది.
అయితే ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి విడత డబ్బులను త్వరలో రైతుల బ్యాంకు ఖాతాల్లో కేంద్రం జమ చేసే అవకాశముంది. మే 2 తర్వాత ఎప్పుడైనా రైతుల బ్యాంకు అకౌంట్లలో ఈ డబ్బులు పడే అవకాశముందని నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది మార్చి 24 నుంచి ఏప్రిల్ 20 మధ్యలోనే తొలి విడత డబ్బులు జమ అయ్యారు.
కానీ కరోనా సంక్షోభం, ఆర్థిక పరిస్థితుల వల్ల ఈ ఏడాది తొలి విడత నగదు జమలో ఆలస్యం జరుగుతోంది. గత నెలలోనే తొలి విడత డబ్బులు పడాల్సి ఉంది. కానీ ఎన్నికల బిజీలో అధికార యంత్రాంగం ఉండటంతో జాప్యం జరిగింది. ఈ నెలలో ఖచ్చితంగా అడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే కరోనా కారణంగా పరిపాలనా పరమైన అనుమతుల వల్ల జాప్యం జరిగినట్లు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
Share your comments