News

ప్రధానమంత్రి కిసాన్ & ఇతర వ్యవసాయ పథకాలు రైతులకు కొత్త బలాన్ని అందిస్తున్నాయి: ప్రధాని మోదీ

Srikanth B
Srikanth B

ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (10 ఏప్రిల్ 2022) ఒక సదస్సులో ప్రసంగిస్తూ పీఎం కిసాన్ యోజన మరియు వ్యవసాయానికి సంబంధించిన ఇతర పథకాలు మన దేశంలోని కోట్లాది మంది రైతులకు కొత్త బలాన్ని అందిస్తున్నాయని అన్నారు.

 

రైతులను ప్రశంశించిన మోదీ, రైతులు బలపడినప్పుడే దేశం దేశం దానంతట అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఒక ట్వీట్‌లో, "దేశం మన రైతుల గురించి గర్విస్తోంది. వారు ఎంత బలంగా ఉంటే, నవ భారతదేశం మరింత సుసంపన్నం అవుతుంది. నేను సంతోషంగా ఉన్నాను... ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి & వ్యవసాయానికి సంబంధించిన అనేక ఇతర పథకాలు దేశంలోని కోట్లాది మంది రైతులకు కొత్త బలాన్ని అందిస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు ఇతర పథకాల గురించిన సమాచారాన్ని కూడా ప్రధాని మోదీ పంచుకున్నారు . పంచుకున్న సమాచారం ప్రకారం, భారతదేశంలోని దాదాపు 11.3 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి రూ. 1.82 లక్షల కోట్లు నేరుగా బదిలీ చేయబడ్డాయి.

మహమ్మారి సమయంలో రూ.1,30 లక్షల కోట్లు పంపిణీ చేశారు

పిఎం కిసాన్ యోజన కింద రైతులందరికీ సంవత్సరానికి రూ. 6,000 సహాయం అందించబడుతుందని మరియు మహమ్మారి సమయంలో, రూ. 1,30 లక్షల కోట్లు పంపిణీ చేయబడిందని, ఇది చిన్న రైతులకు చాలా సహాయకారిగా ఉందని చాలా మందికి తెలుసు. వీటితోపాటు వ్యవసాయ ప్రాథమిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం 11,632 ప్రాజెక్టులకు రూ.8,585 కోట్ల రుణం మంజూరు చేశారు.

అన్ని APMC మండీలు (మార్కెట్లు) డిజిటల్‌గా కలిపారని, ఇందులో 1.73 కోట్ల మంది రైతులు నమోదు చేసుకున్నారని మరియు eNAM లో రూ. 1,87 లక్షల కోట్ల వ్యాపారం జరిగిందని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు .

నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (eNAM) అనేది పాన్-ఇండియా ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ వెబ్‌సైట్ అని గమనించాలి, ఇది వ్యవసాయ వస్తువుల కోసం ఏకీకృత జాతీయ మార్కెట్‌ను సృష్టించడానికి ఇప్పటికే ఉన్న APMC మండీలను లింక్ చేస్తుంది.

ఇది కూడా చదవండి .

70 ఎకరాలు, 5 కోట్ల చెట్లు: ఏకంగా అడవినే సృష్టించిన సూర్యపేట వాసి -'దుశర్ల సత్యనారాయణ'

Related Topics

PM Kisan PM Modi

Share your comments

Subscribe Magazine