News

అన్నీ ఇందులోనే .. అందుబాటులోకి పీఎం కిసాన్ మొబైల్ యాప్

KJ Staff
KJ Staff
pm kisan mobile app
pm kisan mobile app

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా రైతులకు ప్రతి ఏడాది రూ.6 వేలు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. రూ.2 వేల చొప్పున మూడు విడతలుగా వీటిని నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. అంటే సంవత్సరంలో నాలుగు నెలలకు ఒకసారి రూ.2 వేల చొప్పున జమ చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా బటన్ నొక్కి వీటిని విడుదల చేస్తూ ఉంటారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఈ నగదును కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.

ఇప్పటివరకు 8 విడతల సొమ్మును ప్రభుత్వం రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ చేసింది. ఈ పథకానికి ఇప్పటికీ అప్లై చేసుకోనివారు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లేదా ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి పీఎం కిసాన్ అధికారికి అప్లికేషన్ అందించవచ్చు. ఇక మీసేవా, కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం మొబైల్ యాప్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది. డిజిటల్ ఇండియాలో భాగంగా పీఎం కిసాన్ యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా సులువుగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యాప్ ద్వారా పథకానికి అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ స్టేటస్, లబ్ధిదారుల జాబితా, డబ్బులు జమ అయ్యాయా.. లేదా.. ఇప్పటివరకు మీకు ఎన్ని విడతల డబ్బులు అందాయి లాంటి అనేక వివరాలు సులువుగా తెలుసుకోవచ్చు.

ఇక ఆధార్ కార్డులో ఉన్నట్లుగానే పీఎం కిసాన్ లబ్ధిదారుల జాబితాలో మీ పేరు మార్చుకోవడం, డబ్బులు రాకపోతే ఏం చేయాలి, ఏ నెంబర్లకు కాల్ చేయాలి లాంటి అనేక వివరాలను ఈ యాప్ లో పొందుపర్చారు. ఇలా ఈ యాప్ ద్వారా సులువుగా అన్నీ తెలుసుకోవచ్చు. రైతులు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని ఈజీగా సేవలు పొందవచ్చు.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్పర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్పర్మెటిక్స్ సెంటర్ ఈ యాప్ ను రూపొందించింది. గూగుల్ ప్లే స్టోర్ లో పీఎం కిసాన్ అని టైప్ చేస్తే ఈ యాప్ కనిపిస్తుంది. ఈ యాప్ సైజ్ 20 ఎంబీ ఉంటుంది. ఇప్పటికే 50 లక్షల మంది ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని సులువుగా పీఎం కిసాన్ కు సంబంధించిన అన్ని సేవలు పొందండి.

Share your comments

Subscribe Magazine