News

పిఎం కిసాన్ యోజన: రూ. 4350 కోట్ల కంటే ఎక్కువ నిధులు అనర్హులు లబ్ది పొందారు,తిరిగి జప్తు చేయాలనీ రాష్ట్రాలను కేంద్రం కోరింది.

S Vinay
S Vinay

పిఎం కిసాన్ పథకం కింద అనర్హులకు బదిలీ చేయబడిన డబ్బును వీలైనంత త్వరగా తిరిగి పొందాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలని కోరింది. రైతులను వ్యవసాయంలో ప్రోత్సహించడానికి అమలు చేసిన పథకం - పిఎం కిసాన్ కింద రూ. 4,350 కోట్లకు పైగా అనర్హులకు బదిలీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వంగుర్తించింది. వీలైనంత తొందరగా ఈ నిధులను తిరిగి జప్తు చేయాలని రాష్ట్రాలకు సలహా ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది

దీని గురించి మరిన్ని వివరాలను తెలియజేస్తూ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ, రైతులందరికీ పంపిణీ చేసిన మొత్తంలో 2% అంటే 4,352.49 కోట్ల రూపాయలకు పైగా ఈ పథకం కింద అనర్హుల లబ్ధిదారులకు బదిలీ చేయబడినట్లు నివేదించబడింది.అనర్హులైన లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేసి ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలని అన్ని రాష్ట్రాలకు తెలియజేసామని మంత్రి వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌లో తిరిగి చెల్లించే సదుపాయాన్ని ప్రారంభించామని, దీని ద్వారా ఎవరైనా వ్యక్తిగతంగా ఎన్టీఆర్‌పి సిస్టమ్ ద్వారా డబ్బును తిరిగి చెల్లించవచ్చని తోమర్ చెప్పారు. అనర్హుల నుంచి ఇప్పటి వరకు రూ.296.67 కోట్లు వసూలు చేసినట్లు పేర్కొన్నారు.


11వ విడత ఏప్రిల్‌లో విడుదల కానుంది
ఈ పథకం కింద 11 వ విడత ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది . కాబట్టి ముందుగా, రైతులందరూ అధికారిక వెబ్‌సైట్‌లో eKYC ని పూర్తి చేయాలి. eKYC ని పూర్తి చేయకపోతే ఏప్రిల్‌లో తదుపరి విడతను పొందలేరు.

PM కిసాన్ పథకం గురించి తెలుసుకుందాం.
ఫిబ్రవరి 2019 సంవత్సరంలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రారంభించబడింది.

చిన్న మరియు సన్నకారు రైతుల పంటల పెట్టుబడికి ఆసరా ఇవ్వటమే దీని ముఖ్య ఉద్దేశం

ఈ పథకం కింద కేంద్రం ఏడాదికి రూ. 6,000 మొత్తాన్ని, మూడు సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తుంది.

దీనిని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది .

మరిన్ని చదవండి.

PM KISAN :జాబితాలో మీ పేరు ను ఇలా చెక్ చేయండి !

Share your comments

Subscribe Magazine