రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచి వ్యవసాయంలో వారికి అండగా నిలవడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించి అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పథకం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం. ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా దాదాపు 12 కోట్లు మంది రైతులు ఆర్థికంగా ప్రయోజనం పొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ పథకంలో భాగంగా20 వేల కోట్లు రైతు ఖాతాలకు పంపిణీ చేశారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన
పథకంలో భాగంగా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 6,000 రూపాయలు డైరెక్టుగా వారి ఖాతాలో జమ చేస్తున్నారు.అయితే ఈ డబ్బులను ఒకేసారి రైతుల ఖాతాల్లో వేయదు. విడతల వారిగా రూ. 2000 చొప్పున రైతుల బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు.ఇప్పటికే ఈ పథకం ద్వారా 8 విడుదలలో డబ్బులు పంపిణీ చేశారు. తాజాగా 9వ విడత నగదును పంపిణి ఏర్పాట్లు చేస్తున్నారు.
దేశంలోని ప్రతి రైతుకు తనకున్న భూమితో సంబంధం లేకుండా ఈ పథకంలో భాగంగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు రైతుల వివరాలతో కూడిన ఆధార్ లింక్డ్ ఎలక్ట్రానిక్ డేటాబేస్ ద్వారా ఈ పథకం అమలు చేయబడుతోంది. అయితే మీరు ఇప్పటివరకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకంలో రిజిస్టర్ కాలేదా. అయితే రిజిస్టర్ చేసుకోవడానికి ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి. రైతు పూర్తి వివరాలతో కూడిన పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ నంబర్, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ మరిన్ని వివరాలకు
మీరు 011-24300606 ,011-23381092, 011 23382401 వంటి టోల్ ఫ్రీ నెంబర్లకు కూడా కాల్ చేయొచ్చు.
Share your comments